Newsపెళ్లైన 6 నెల‌ల‌కే విడాకులిచ్చేసిన ' భీమ్లానాయ‌క్ న‌టి '.. షాకింగ్...

పెళ్లైన 6 నెల‌ల‌కే విడాకులిచ్చేసిన ‘ భీమ్లానాయ‌క్ న‌టి ‘.. షాకింగ్ రీజ‌న్‌..!

సినిమా రంగంలో పెళ్లి, సహజీవనం, బ్రేకప్ లు, విడాకులు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. పెళ్ళికి ముందు పీకల్లోతు ప్రేమలో ఉంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళలో చాలామంది సినీ జంటలు పెళ్లికి ముందే గొడవలతో బ్రేకప్ లు చెప్పేసుకుంటారు. మరికొందరు పెళ్లయ్యాక ఆరు నెలలు.. ఏడాది రెండు సంవత్సరాల లోపల విడాకులు తీసుకుంటారు. స్టార్ హీరో- హీరోయిన్లు సమంత- నాగచైతన్య నుంచి మొదలుపెడితే ఎంతో మంది బుల్లితెర నటీనటుల వరకు ఈ లిస్టులో చేరిపోతున్నారు.

ఇటీవల కాలంలో మెగా డాటర్‌ నిహారిక విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు మరో తెలుగు నటి కూడా విడాకులు తీసుకోనుందా ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. షార్ట్ ఫిలిమ్స్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. సూర్య వెబ్ సిరీస్‌తో బాగా పాపులర్ అయింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో పాటు ప‌లు సినిమాలలో సహాయ పాత్ర‌లు చేసింది. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పక్కన కనిపించే లేడీ ఇన్స్పెక్టర్‌గా కనిపించింది.

కొన్నాళ్లుగా సందీప్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న మౌనిక రెడ్డి మనసులు కలిసిన తర్వాత గత ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. గోవాలో వీరి డెస్టినేష‌న్ వెడ్డింగ్ వైభ‌వంగా జ‌రిగింది. పెళ్లి టైం లో మౌనిక చాలా ఎక్సైట్ అవుతున్న వీడియో అప్పట్లో చాలా పాపులర్ అయింది. అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో తాజాగా ఈమె భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

తన పెళ్లి ఫోటోలు అన్ని తన సోష‌ల్‌మీడియ‌లో డిలీట్ చేసింది. అలాగే భర్త సందీప్ ని కూడా అన్‌ఫాలో చేసింది. దీనితో వీళ్ళిద్దరి బంధం బ్రేకప్ అయ్యిందా ? అన్న పుకార్లు ఇండస్ట్రీలో వస్తున్నాయి. ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మౌనిక రెడ్డి తన భర్తతో కలిసి ఉండటం లేదని సమాచారం. త్వరలోనే వీరిద్దరి విడాకులపై అధికారిక ప్రకటన వస్తుందన్న చర్చ నడుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news