News' భ‌గ‌వంత్ కేస‌రి ' ఆంధ్రా బిజినెస్‌... బాల‌య్య మ్యాస్ ర్యాంపేజ్‌...!

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ఆంధ్రా బిజినెస్‌… బాల‌య్య మ్యాస్ ర్యాంపేజ్‌…!

నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ – వీర సింహారెడ్డి లాంటి రెండు సాలిడ్ విజయాల తర్వాత భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలు.. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ సినిమాతో భారీ లెవెల్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. దసరా కానుకగా ఈ నెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకు చిరంజీవి వాల్తేరు వీరయ్య – విజయ్ వారసుడు సినిమాల నుంచి గట్టి పోటీ నెలకొంది. అలాగే ఇప్పుడు కూడా బాలయ్య కేసరి సినిమాకు మరోసారి విజయ్ లియోతో పాటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాల నుంచి గట్టి పోటీ ఉంది. ఇటు హీరో రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అటు డైరెక్టర్ కు ఆరు సూపర్ డూపర్ హిట్లు.. అస్సలు ప్లాప్ అన్నదే లేదు.

అలాంటి కాంబినేషన్లో వస్తున్న సినిమా.. పైగా బాలయ్య – కాజ‌ల్ కాంబినేషన్లో తొలి సినిమా. టాలీవుడ్ ను ఊపేస్తున్న యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్, తమన్ సంగీతం ఇవన్నీ కలిసి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఊపేస్తున్నాయి. వైజాగ్ ఏరియాలో గతంలో బాలయ్య సినిమాలకు ఎన్నడూ లేనట్టుగా రు. 8 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ రేంజ్ బిజినెస్ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్‌, బ‌న్నీ, ఎన్టీఆర్ సినిమాల‌కే ఉండేది.

వైజాగ్ ఏరియాలో బాలయ్య సినిమాకు ఈ రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అంటే బాలయ్య మాస్ ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అలాగే మిగిలిన ఏరియాలలో కూడా భగవంత్ కేసరికి సూపర్ సాలిడ్ బిజినెస్ జరుగుతున్నట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news