Newsమంచు విష్ణు భ‌క్త‌క‌న్న‌ప్ప‌లో మెగాస్టార్ రోల్ ఇదే..!

మంచు విష్ణు భ‌క్త‌క‌న్న‌ప్ప‌లో మెగాస్టార్ రోల్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ హీరో, మంచు వారి వారసుడు మంచు విష్ణు ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టు భక్తకన్నప్ప సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విష్ణు తండ్రి డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు నిర్మాణ సారథ్యం వ‌హిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో పాన్‌ ఇండియా వైడ్‌గా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఆ డిజైన్ల‌ను కంటైనర్లలో ప్యాక్ చేసి మ‌రీ న్యూజిలాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

ఈ పాన్ ఇండియా సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ పేరు బయటకు వచ్చి సెన్సేషన్ అయింది. ఇక ఇప్పుడు మరి కొంతమంది బిగ్ స్టార్లు కూడా ఈ సినిమాకు యాడ్ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ అయిన మోహన్లాల్ కూడా నటిస్తున్నట్టు ఇప్పటివరకు వచ్చిన వార్తలు కన్ఫర్మ్ చేశాడు మంచు విష్ణు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకి మోహన్‌లాల్ ఓకే చెప్పారని… దీంతో ఆయన ప్రజెన్స్‌ కూడా ఈ సినిమాలో ఉంటుంది అన్నది కన్ఫర్మ్ అయింది.

మోహన్ లాల్ – మంచు విష్ణు కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఈ సినిమాలో మోహన్‌లాల్ ఒక గురువు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే పలువురు సీనియర్ నటీమణులు కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్టు సమాచారం. నయనతారతో పాటు హన్సిక తదితరులు కూడా నటిస్తున్నట్టు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news