Movies' దేవ‌ర‌ ' లో ఎన్టీఆర్ పాత్ర చ‌నిపోతుందా… కొర‌టాల మైండ్...

‘ దేవ‌ర‌ ‘ లో ఎన్టీఆర్ పాత్ర చ‌నిపోతుందా… కొర‌టాల మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తరకెక్కుతున్న సినిమా దేవర. త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్బస్టర్ పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా దేవర క్లైమాక్స్ పై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. చనిపోయాడు అనుకున్నదేవర ( ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎన్టీఆర్ రెండో పాత్ర ) క్లైమాక్స్ సీన్లో ఎంట్రీ ఇస్తాడని అలాగే ఈ క్లైమాక్స్ లోనే దేవర పాత్ర‌కు సంబంధించిన మిస్టరీ పాయింట్ కూడా రివిల్ అవుతుందని తెలుస్తోంది.

ఇక దేవర సీక్వెల్ లీడ్ కూడా ఈ క్లైమాక్స్ లోనే రివీల్ అవుతుందని ఈ సినిమా యూనిట్ ద్వారా లీకులు అయితే బయటకు వస్తున్నాయి. నిజంగా దేవర సినిమాకి సీక్వెల్ ఉంటుందా? రెండో పార్ట్‌లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తారా లేదా ? వేరే హీరో నటిస్తారా అన్నదానిపై కూడా కొరటాల ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే దేవరపాత్ర కోసం తారక కూడా డిఫరెంట్ మేకవర్ ట్రై చేస్తున్నాడు.

కథపై కొరటాల చాలా బాగా కసరత్తులు చేశాడు. అందుకే దేవర కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పైగా ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ పాన్ ఇండియా సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news