Movies"ఆ రూమర్ నిజం అవ్వాలని ఎంత కోరుకున్నానో".. టాప్ సీక్రేట్ ని...

“ఆ రూమర్ నిజం అవ్వాలని ఎంత కోరుకున్నానో”.. టాప్ సీక్రేట్ ని లీక్ చేసిన జాన్వీ కపూర్..!!

ఎస్ ప్రెసెంట్ బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి . రీసెంట్గా వరుణ్ ధావన్ తో కలిసి “బవాల్” సినిమాలో నటించిన ఈ బ్యూటీ ..మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ.. తెలుగులో చేస్తున్న “దేవర: సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . ఈ క్రమంలోనే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నింది.

ఆమె మాట్లాడుతూ..” కొరటాల శివ గారు ఎన్టీఆర్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అని తెలియగానే ఈ ఆఫర్ నాకే రావాలి అని అనుకున్నాను. అప్పటికే చాలా మంది హీరోయిన్స్ ని అప్రోచ్ అవుతున్నారు అని తెలిసి..చాలా టెన్షన్ పడ్డాను..కొన్ని మీడియా ఛానల్స్ లో సోషల్ మీడియాలో నా పేరు వైరల్ అవుతుంది. ఆ వార్త నిజం కావాలని ఎంతో కోరుకున్నాను.. ఫైనల్లీ దేవుడికి పూజలు కూడా చేశాను ..ఆ దేవుడు కరుణించి ఎన్టీఆర్ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఆయనతో నటించాలన్న నా కోరిక నెరవేరింది . మా అమ్మ కోరిక కూడా నెరవేరినట్లే అనుకుంటున్నాను” అంటూ కామెంట్స్ చేసింది .

దీంతో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో సినిమా కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేసింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు కచ్చితంగా ఈ సినిమాతో జాన్వి తెలుగులో మంచి స్థానాన్ని అందుకుంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. మొత్తానికి దేవుడిని అలా కాకా పట్టి ఆఫర్ కొట్టేసింది అన మాట మన జాన్వీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news