Newsరవితేజని సినిమా ఇండస్ట్రీ నుండి లేపేయాలని చూసారా..? ఆఖరికి అంత దిగజారుడు...

రవితేజని సినిమా ఇండస్ట్రీ నుండి లేపేయాలని చూసారా..? ఆఖరికి అంత దిగజారుడు పనులు చేసారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారే కనిపిస్తూ ఉంటారు. సొంతం గా పైకి వచ్చిన వారు చాలా రేర్ . ఎవరో స్వతహాగా ఇండస్ట్రీలోకి వచ్చి హిట్ కొడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకరే రవితేజ . మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఎటువంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డారు .

అయితే ఒకానొక టైంలో మాత్రం క్రేజీ హీరోగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకున్న రవితేజ ఇడియట్ -ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం -ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోలకి సైతం చెమటలు పట్టించాడు . ఒకానొక టైం లో స్టార్ హీరోలతో కన్న రవితేజ తో సినిమాలు చేయాలని డైరెక్టర్ లు ఇంట్రెస్ట్ చూపించారు.

అయితే అదే టైంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఓ వ్యక్తి రవితేజ కెరియర్ను దెబ్బ కొట్టడానికి బాగా ట్రై చేశారట. ఆయన వద్దకు డైరెక్టర్స్ వెళ్తుంటే ఆ హీరో తో సినిమా చేయొద్దు అంతకంటే తక్కువ రెమ్యూనరేషన్ తోనే వేరే హీరో చేస్తారో అంటూ రవితేజ వద్దకు ఆ మంచి కథలను పోనికుండా చేశారట . అనుకున్నట్లుగానే రవితేజ కెరీర్ ని దారుణంగా దెబ్బతీశాడు ఆ హీరో . అయితే దేవుడు అనేవాడు ఉన్నాడు అందుకే రవితేజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ స్టార్ హీరోగా మారాడు . నిన్న కాక మొన్న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య..ధమాకా సినిమాలతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయాడు రవితేజ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news