Moviesపవన్ "బ్రో" సినిమాతో ప్రభాస్ కి ఉన్న లింక్ ఇదే.. ఫ్యాన్స్...

పవన్ “బ్రో” సినిమాతో ప్రభాస్ కి ఉన్న లింక్ ఇదే.. ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కిపోవాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ రూటు మార్చారు. ఎప్పుడు లవ్ – రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కాదు .. కొంచెం ట్రెండ్ మార్చి భిన్న విభిన్నమైన స్టోరీలు సైతం చూస్ చేసుకుంటూ వస్తున్నారు . కాగా ప్రభాస్ అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమాని ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా పలు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు .

కేవలం ప్రభాస్ ఫ్యాన్సే కాదు మిగతా స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉండడానికి కారణం ఈ సినిమా మొత్తం టైం ట్రావెల్ విధంగా ముందుకు వెళుతూ ఉండడమే. అయితే “ప్రాజెక్ట్ కే” సినిమాలో “కే” అంటే ఇన్నాళ్లు ప్రభాస్ కల్కి అవతారంలో కనిపిస్తాడు కాబట్టే కే అని పెట్టారు అంటూ చర్చ నడిచింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం “కే” అంటే కాలచక్ర అని తెలుస్తుంది .

“బ్రో” సినిమాలోను కధ మొత్తం కాలం చుట్టే నడుస్తూ ఉంటుంది. కాలమే ప్రధాన పాత్ర వహిస్తుంది . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకి ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని.. ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్ ఒకటే అని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ – ప్రభాస్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. ఒక్కే కధతో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తుండటంతో ఏ సినిమా హిట్..ఏ సినిమా ఫట్ అవుతుందో తెలియని పరిస్ధితిలో ఉన్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news