Moviesఅప్పుడు సమంత..ఇప్పుడు సాయి ధరమ్ తేజ్..ఒక్కే నిర్ణయం.. అసలు తెలుగు ఇండస్ట్రీలో...

అప్పుడు సమంత..ఇప్పుడు సాయి ధరమ్ తేజ్..ఒక్కే నిర్ణయం.. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..?

ఈమధ్య సినిమా ఇండస్ట్రీలో వినకూడనివి వింటున్నాం చూడకూడనివి చూస్తున్నాం .. ఎస్ ప్రజెంట్ సినీ లవర్స్ చాలా డిప్రెసివ్ కామెంట్స్ చేస్తున్నారు . ఏమైందో ఏమో తెలియదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా స్టార్ హీరోయిన్స్ అనారోగ్యానికి గురవుతున్నారు . అంతేకాదు స్టార్ హీరోలు కూడా సినిమాలు చేస్తే అవి హిట్ అవ్వడం లేదు . వ్యక్తిగతంగా కొన్ని చికాకుల్లో ఇరుక్కుంటూ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు . ఇదే క్రమంలో పలువురు స్టార్స్ సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెబుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు .

నిన్నటికీ నిన్న హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ వేస్తున్నాను అని అఫీషియల్ గానే ప్రకటించింది . మయోసైటిస్ వ్యాధి మళ్లీ తిరగబడడంతో అమెరికాలో చికిత్స తీసుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ శాడ్ న్యూస్ నుంచి అభిమానులు కోలుకోక ముందే మరో బిగ్ షాక్ ఇచ్చాడు టాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ . ఆయన సినిమా ఇండస్ట్రీకి ఆరు నెలల పాటు బ్రేక్ ఇవ్వనన్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు . దీనికి కారణం ఆయన హెల్త్ కండిషన్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు .

సాయిధరమ్ తేజ్ కి గతంలో బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే . ఆ ప్రమాదం తర్వాత చాలా కాలం రెస్ట్ తీసుకున్న సాయిధరమ్ తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలోనే బ్రో మూవీ తర్వాత ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకొని మరి ఇంకో సర్జరీ చేయించుకొని పూర్తిగా ఆరోగ్యవంతుడిగా తయారైన తర్వాత మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట . ఈ క్రమంలోనే ప్రజెంట్ ఎటువంటి సినిమా కథలో కూడా వినడం లేదంటూ చెప్పుకొచ్చాడు సాయిధరమ్ తేజ్ .

ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు స్టార్స్ సినిమాలకు బ్రేక్ చెప్పడంపై ఫాన్స్ నిరుత్సాహపడుతున్నారు. ఓవైపు హెల్త్ కండిషన్ బాగుండాలి అంటూ కోరుకుంటేనే మరోవైపు ఇండస్ట్రీలో ఎందుకు ఇలాంటి సిచువేషన్ ఎదురవుతున్నాయి. వరుసగా స్టార్ సెలబ్రెటీస్ మరణిస్తున్నారు . మరికొందరు హీరోలకి సినిమాలు సక్సెస్ రావడం లేదు.. కొందరు విడాకులు తీసుకుంటున్నారు దీనిపై సినీ ప్రముఖులు ఏదో ఒక విధంగా ఆలోచించి సొల్యూషన్ వెతకాలి అంటూ చెప్పుకొస్తున్నారు. ఫాన్స్ కూడా ఇదే విధంగా కామెంట్ చేయడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news