Movies"ఈ సినిమాలో నా క్యారెక్టర్ అదే".. ఇంట్రెస్టింగ్ న్యూస్ ని రివీల్...

“ఈ సినిమాలో నా క్యారెక్టర్ అదే”.. ఇంట్రెస్టింగ్ న్యూస్ ని రివీల్ చేసిన ప్రభాస్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రాజెక్టు కె.. కల్కి పేరే.. మారుమ్రోగిపోతుంది . మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . బాలీవుడ్ స్టార్ బ్యూటి దీపికా పదుకొనే -దిశా పఠానీ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు . కమల్ హాసన్ – అమితాబచ్చన్ కూడా ఈ సినిమాలో భాగం కావడం సినిమాకి మరింత బజ్ క్రియేట్ చేసింది . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ గ్లింప్స్ అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ డియాగో లో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్లో రిలీజ్ చేశారు.

కాగా ఈవెంట్లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్టుకే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది . ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని జోనర్ ని నాగ్ అశ్విన్ టచ్ చేసి చూపించబోతున్నందుకు ఇండియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . కాగా ఇదే క్రమంలో ప్రభాస్ కల్కి సినిమా గురించి హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ..ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

“ఇది ఒక సూపర్ సినిమా. ఇందులో క్యారెక్టర్ కొంచెం ఫన్ గా కూడా ఉంటుంది. అసలు నేను ఈ సినిమాలో హీరో అని చెప్పను ..నాగ్ అశ్విన్ నా క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు చూస్తే నాకు నవ్వొచ్చేసింది.. ఆ తర్వాత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను ..సినిమాలో ఎమోషన్స్ – లవ్ – డ్రామా- కామెడీ అన్ని ఉంటాయి “. అంతే కాదు ప్రభాస్ మాట్లాడుతూ..” ఈ సినిమాలో నేను కమెడియన్ ని” అన్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. కధ సిరీయస్ గా ఉంటే ప్రభాస్ కామెడీ క్యారెక్టర్ అంటాడు ఏంటి..? అని అనుకుంటున్నారు జనాలు. అయితే ప్రభాస్ సరదాగా చెప్పాడా.. లేక నిజంగానా సినిమాలో కామెడీ ఉంటుందనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలియాలి..!! మొత్తానికి ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news