Newsఅరెరె.. పవన్ కళ్యాణ్ - నమ్రత కాంబోలో మిస్ అయిన సినిమా...

అరెరె.. పవన్ కళ్యాణ్ – నమ్రత కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే.. చెడకొట్టింది ఆ హీరోనేనా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. వన్స్ అలాంటి క్రేజీ కాంబో మిస్ అయిందా మళ్లీ ఆ కాంబో సెట్ అవ్వాలంటే చాలా ఏళ్లు పడుతుంది . కొన్ని కొన్ని సార్లు అలాంటి కాంబో అసలు సెట్ అవ్వదు అలాంటి లిస్టులోకే వస్తారు టాలీవుడ్ పవర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ – స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసిన హీరోయిన్ నమ్రత. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరొద్కర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండే ఈమె ఒకప్పుడు తన అందచందాలతో సినిమా ఇండస్ట్రీని ఏలేసింది . మహేష్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన పూర్తి లైఫ్ ఫ్యామిలీకి అంకితం చేసిన నమ్రత.. గతంలో తెలుగులో చిరంజీవి సరసన కూడా నటించి మంచి మార్కులు వేయించుకుంది . అయితే ఒకానొక టైంలో మహేష్ బాబు భార్య నమ్రత పవన్ కళ్యాణ్తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉండిందట. అయితే కొన్ని కారణాల చేత ఈ ఛాన్స్ మరో హీరోయిన్ కి వెళ్ళిపోయింది . ఆ సినిమా ఏంటో ఇప్పుడు ఎక్కడ చదివి తెలుసుకుందాం ..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలు నటించాడు. కొన్ని సినిమాల హిట్ అయితే కొన్ని సినిమాలు ఫట్ అయ్యాయి . ఫ్లాప్ సినిమాల్లో కూడా తనదైన స్టైల్ లో మార్క్ వేసుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు . అలా పవన్ కళ్యాణ్ కెరియర్ లో అందరికీ గుర్తుండిపోయే సినిమా బాలు . బాలు అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినా అభిమానుల మనసులో మాత్రం మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ చిత్రంలో ఫ్యాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ పాత్ర కోసం అప్పట్లో చాలామంది హీరోయిన్స్ ట్రై చేశారట .

అంతేకాదు ఆ లిస్టులో నమ్రత కూడా ఉంది అంటూ తెలుస్తుంది . ఆమెకు కథ బాగా నచ్చింది కానీ నటించేందుకు మహేష్ బాబు అనుమతి కోసం ఎదురు చూసిందట . అయితే మహేష్ బాబు ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో నమ్రత ఈ ఆఫర్ ని వదిలేసుకుందట. దీంతో పవన్ కళ్యాణ్తో చేసే లక్కీ ఛాన్స్ మిస్ అయిపోయింది నమ్రత. అప్పుడు మిస్ అయిన కాంబో అసలు ఇప్పటివరకు సెట్ అయ్యిందే లేదు. ఒకవేళ ఈ సినిమా గాని ఒప్పుకొని ఉంటే నిజంగా నమ్రత – పవన్ కెరియర్ లో గుర్తుండిపోయేది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news