Newsబిగ్ బ్రేకింగ్ : కల్కి 2898 ఏడీ సినిమా నుండి సెన్సేషనల్...

బిగ్ బ్రేకింగ్ : కల్కి 2898 ఏడీ సినిమా నుండి సెన్సేషనల్ మ్యాటర్ లీక్..ప్రభాస్ ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనిది ఇది..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ప్రాజెక్టుకె. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గానే గ్లింప్స్ రిలీజ్ అయింది . కాగా మొదటి నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఈ సినిమా గ్లింప్స్ చూడగానే మరింత స్థాయిలో హైప్ పెంచేసుకున్నారు అభిమానులు . కాగా ఇలాంటి క్రమంలోనే అమెరికాలోని సాండ్ డియోగో కామికన్ ఈవెంట్లో మాట్లాడుతూ కమలహాసన్ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు.

అప్పటివరకు కమలహాసన్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరో పాత్ర చేస్తున్నారని .. అంతా అనుకున్నారు. అయితే తాను హీరో కాదు విలన్ అంటూ పరోక్షకంగా చెప్పేశాడు కమల్ హాసన్. ఇదే క్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ..” నేను ఈ సినిమాలో నటిస్తున్నాను అంటే ప్రభాస్ సైతం నమ్మలేదు. ఈ కథను ఎందుకు చేసానో మీకు చెప్పాలి ..కొన్ని వేల నుంచి మేము పురాణాలను ఫాలో అవుతున్నాం . ఆ పురాణాల గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసమే నాగ్ అశ్విన్ ఈ మూవీ తీస్తున్నాడు . నా వంతు సహాయంగా ఈ సినిమాలో నా ఇష్టప్రకారమే భాగమయ్యాను . ఒక సినిమాకు హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే అవసరం ..అందుకే నేను విలన్ గా కనిపించడానికి ఓకే చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో స్టార్ హీరో కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నాడు అంటే ఆ సినిమాలో ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు అభిమానులు . దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది . కాగా విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన కమల్ ఇప్పుడు ప్రభాస్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడనే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news