Moviesబిగ్ షాకింగ్: ఎన్టీఆర్ 31 సినిమా ఆగిపోయింది.. కొంప ముంచేసిన ప్రశాంత్...

బిగ్ షాకింగ్: ఎన్టీఆర్ 31 సినిమా ఆగిపోయింది.. కొంప ముంచేసిన ప్రశాంత్ నీల్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా సైన్ చేసిన ఎన్టీఆర్ 31 సినిమా ఆగిపోయిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దీనికి కారణం లేకపోనూ లేదు . ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చి చాలా ఏళ్ళే అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక క్రేజీ బజ్ కూడా వైరల్ అవ్వలేదు .

ప్రెసెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది . అయితే ప్రశాంత్ నీల్ పర్జెంట్ “సలార్ ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . నిన్న మొన్నటి వరకు ఈ సినిమా ఒక్క పార్ట్ గానే తెరకెక్కుతుందని.. ఈ సినిమా షూట్ అయిపోగానే ప్రశాంత్ – ఎన్టీఆర్ తో సినిమాను సట్స్ పైకి తీసుకొస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూశారు. ఈ సినిమా రెండు పార్టులు గా తెరకెక్కబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫామ్ చేశాడు ప్రశాంత్ నీల్.

ఈ క్రమంలోనే సలార్ పార్ట్ వన్ సినిమా హిట్ అవ్వగానే పార్ట్ 2 సినిమాని సైతం సెట్స్ స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్రశాంత్ నీల్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారట . ఈ లెక్కన చూసుకుంటే ఎన్టీఆర్ 31 సినిమా కి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పైనే పడుతుంది . అయితే ఈ లోపు ఎన్టీఆర్ – కొరటాల దర్శకత్వంలో వస్తున్న సినిమా సైతం రిలీజ్ అయిపోయి హిట్ కూడా కొట్టేస్తుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ డీలా పడిపోయారు. ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్నారు .

ముందు ఎన్టీఆర్ తో సినిమా కంప్లీట్ చేశాక ..ప్రభాస్ తో సలార్ 2 తీయాలి. నువ్వు ఎన్టీఆర్ ని హోల్డ్ లో పెట్టి ఆయన కాల్ షీట్స్ తీసేసుకుని ఆయన ని ఖాళీగా ఉంచితే ఆయన కెరియర్ ఏమైపోవాలి అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు కొంతమంది జనాలు ఈ సినిమా ఆగిపోయింది అని కూడా ప్రచారం చేస్తున్నారు . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత స్థాయిలో బాధపడిపోతున్నారు . అసలు ఎన్టీఆర్ 31 సినిమా ఉందా..? లేదా..? ఈ సినిమాపై టీం కానీ ..ప్రశాంత్ నీల్ కానీ.. ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు నందమూరి అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news