Moviesఆ రోజు నైట్ నీహారిక కళ్ళు మూసుకుని భరించి ఉంటే.. ఈరోజు...

ఆ రోజు నైట్ నీహారిక కళ్ళు మూసుకుని భరించి ఉంటే.. ఈరోజు ఇలా పరిస్ధితి దాపురించేదే కాదా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియా ఆన్ చేసిన మొదలు ఆఫ్ చేసే వరకు ప్రతిసారి సోషల్ మీడియాలో నిహారిక పేరు ఎక్కడో ఒక చోట ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. దానికి రీజన్ అమ్మడు తన భర్తకు డివర్స్ ఇవ్వడమే అంటూ తెలుస్తుంది . దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేకుండా బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం పనులన్నీ పూర్తయిపోయినాయి అని అంటున్నారు మెగా అభిమానులు .

ఈ క్రమంలోనే అసలు నీహారిక చైతన్యలు మధ్య గొడవ రావడానికి కారణం ఆ డ్రగ్స్ ఇష్యూ అంటూ తెలుస్తుంది. మనకు తెలిసిందే గతంలో నిహారిక ఓ డ్రగ్స్ ఇష్యూలో అడ్డంగా బుక్ అయిపోయింది. పబ్బులో పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడ పోలీస్ రైడ్ జరిగింది . అయితే ఆ పబ్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ పోలీసులకు సమాచారం రావడంతో రైడ్ చేశారు. ఆ రైడ్లో నిహారిక కనిపించడం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం నిహారిక అత్తమామలకు నచ్చలేదు .

ఈ క్రమంలోనే చైతన్య భార్య ఇలాంటిది అంటూ పలువురు ఆమెను నిందించారట . అయితే ఆమె డ్రగ్స్ తీసుకుందా..? తీసుకోలేదా..? అనే విషయం పక్కన పెడితే జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ ఆమెను దారుణంగా అవమానించి అనుమానించిందట . అప్పటినుంచి ఫుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టి బయటకు వెళ్లొద్దు అంటూ గేట్లు క్లోజ్ చేసేసిందట. నిహారిక ఆ రెస్ట్రిక్షన్స్ ని తట్టుకోలేక విడాకులు తీసుకోనింది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఆ రోజు నైట్ జొన్నలగడ్డ చైతన్య సైతం నిహారిక పై బాగా ఫైర్ అయ్యారని ..నోటికొచ్చినట్లు అరిచేసారని ..మెగా ఫ్యామిలీని సైతం బూతులు తిట్టారని.. ఆ కారణంగానే నిహారిక డివర్స్ వరకు వెళ్ళింది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news