Moviesపెళ్లికి రెడి అయిన మృణాల్ ఠాకూర్..బిగ్ డే అంటూ షాకింగ్ పోస్ట్..ఫ్యాన్స్...

పెళ్లికి రెడి అయిన మృణాల్ ఠాకూర్..బిగ్ డే అంటూ షాకింగ్ పోస్ట్..ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనది ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతూ ఉంటుందో మనం గెస్ చేయలేము. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు అలాంటి మాయలకు బలైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు . అయితే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు . అలాంటి లిస్టులోకే వస్తుంది అందాల ముద్దు గుమ్మ మృణాల్ ఠాకూర్ . గతంలో సీరియల్స్ లో నటించినా.. పలు సినిమాల్లో నటించినా రాని క్రేజ్ గుర్తింపు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా చూడగానే వచ్చేసింది .

ఓవర్ నైట్ లో అమ్మడుని స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రిలో నిలబెట్టింది ఈ సినిమాఅనే చెప్పాలి. కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది, కూల్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు తెగ నచ్చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో మృణాల్ ఠాకూర్ పేరు మారుమ్రోగిపోయింది.

కాగా సీతారాం సినిమా తర్వాత మృణాల్ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ కి సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఆమె ఏ పోస్ట్ చేసిన సరే ఇట్టే సెకండ్స్ లో వైరల్ గా మారిపోతుంది. కాగా రీసెంట్గా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా పెళ్లికూతురు గా రెడి అయిన గెటప్ లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది .

ఈ ఫొటోస్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు . నిజంగానే మృణాల్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటూ ఆశ్చర్యపోయారు . చేతికి మెహేంది ఎర్రటి లెహంగాలో ఒంటి నిండా నగలతో అచ్చం పెళ్లికూతురులా ముస్తాబై ఉన్న ఈ ఫొటోస్ ఓ మూవీ షూట్ కి సంబంధించినవి అంటూ తెలుస్తుంది . అయితే సడన్గా ఈమె ఈ ఫోటో షేర్ చేయడంతో పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ అంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news