Moviesభ‌గ‌వంత్ కేస‌రి Vs భోళాశంక‌ర్ Vs బ్రో… ఎవ‌రు హిట్‌.. ఎవ‌రు...

భ‌గ‌వంత్ కేస‌రి Vs భోళాశంక‌ర్ Vs బ్రో… ఎవ‌రు హిట్‌.. ఎవ‌రు ఫ‌ట్‌…!


ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో, సోష‌ల్ మీడియాలో ఇదే పెద్ద చ‌ర్చ‌గా మారింది. ముగ్గురు సీనియ‌ర్ స్టార్ హీరోల బాల‌య్య‌, చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న మూడు సినిమాల టీజ‌ర్లు రిలీజ్ అయ్యాయి. బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి, చిరంజీవి భోళాశంక‌ర్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ బ్రో సినిమాలు త్వ‌ర‌లోనే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ మూడు సినిమాల టీజ‌ర్లు అయితే బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.

ఈ మూడు సినిమాల్లో మెగా హీరోలు చిరు, ప‌వ‌న్ న‌టిస్తోన్న రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే. బాల‌య్య సినిమా మాత్ర‌మే డైరెక్టుగా వ‌స్తోంది. ఈ మూడు సినిమాల టీజ‌ర్ల‌లో బాల‌య్య సినిమా టీజ‌ర్ ఆద్యంతం ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంది. బాల‌య్య చెప్పిన డైలాగుల‌తో పాటు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా బాల‌య్య‌ను టీజ‌ర్‌లో చూపించిన తీరు.. బాల‌య్య ఏజ్‌కు త‌గిన పాత్ర‌.. ఆ స్టైల్ అంతా అదిరిపోయింది.

దీనికి తోడు థ‌మ‌న్ ఇచ్చిన నేప‌థ్య సంగీతం కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అస‌లు ఈ టీజ‌ర్‌కు ఎవ్వ‌రూ వంక పెట్ట‌డం లేదు. ఇక సెకండ్ ప్లేస్‌లో ప‌వ‌న్ – సాయిధ‌ర‌మ్ బ్రో సినిమా టీజ‌ర్ ఉంది. బ్రో సినిమాలో ప‌వ‌న్ చేసిన కామెడీ, ఆ డైలాగులు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ సెట్ అయ్యాయి. అయితే బాల‌య్య టీజ‌ర్ త‌ర్వాత ప్లేసులో నే బ్రో టీజ‌ర్ ఉంద‌ని చెప్పాలి.

ఇక ఈ లిస్టులో మూడో ప్లేసులో అట్ట‌డుగున ఉంది చిరు భోళాశంక‌ర్ టీజ‌ర్‌. టీజ‌ర్లో డైలాగులు, చిరు స్టైల్ ఏ మాత్రం కొత్త‌గా లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అస‌లు మెగా వీరాభిమానుల‌కే ఈ టీజ‌ర్ న‌చ్చ‌డం లేదు. చిరు స్టైల్‌, క‌థ‌, సీన్లు అన్నీ కూడా ఎప్పుడో బూజుప‌ట్టిన‌ట్టుగా ఉన్నాయంటున్నారు. ఏదేమైనా ఈ మూడు సినిమాల టీజ‌ర్ల‌లో బాల‌య్య సినిమా టీజ‌ర్ మాత్రం చాలా హైలెట్‌గా నిలిచింద‌ని.. ఫ‌స్ట్ మార్కులు అన్నీ దానికే ప‌డ్డాయ‌ని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news