Moviesఅల్లు అర్జున్ హీరో ఏంటి..? మెగా ఫ్యామిలీ నుండి వస్తే హీరో...

అల్లు అర్జున్ హీరో ఏంటి..? మెగా ఫ్యామిలీ నుండి వస్తే హీరో అయిపోతారా..? మళ్లీ కెలికిపెట్టిన అనసూయ..!!

పాపం అనసూయ.. ఏ ముహూర్తాన జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిందో తెలియదు కానీ ..అప్పటినుంచి సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది. ఏది ముట్టుకున్న సరే బ్లాస్టింగ్ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అవుతూ అనసూయ ను దారుణంగా ట్రోలింగ్ కి గురయ్యాలా చేస్తుంది. నిన్న మొన్నటి వరకు హీరో విజయ్ దేవరకొండ తో ఆయన క్లాష్ కారణంగా ఆమెను ఆంటీ ఆంటీ అంటూ ఏ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేశారో ఫాన్స్ మనకు తెలిసిందే . అయితే రీసెంట్ గానే ఆనంద్ దేవరకొండ సినిమాకు సంబంధించి పాజిటివ్ ట్వీట్ చేయడంతో మ్యాటర్ మొత్తం సాల్వ్ అయిపోయింది ..ఇక అనసూయ కెరీర్ కు ఎటువంటి ఢోకా లేదు అనుకుంటున్నా టైంలో మళ్లీ పాత వీడియో అనసూయ కెరియర్లో చిచ్చు పెట్టింది.

గతంలో అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది . ఆ వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆ వీడియోలో అనసూయ మాట్లాడుతూ..” అల్లు అర్జున్ హీరో ఏంటి ..? గంగోత్రి సినిమా చూశారా ..? అసలు ఆయన హీరో లాగా ఉన్నాడా ..? ఈ సినిమాలో ఓ పాటలో అల్లు అర్జున్ లేడీ గెటప్ లో కనిపిస్తాడు.. అస్సలు చూడలేకపోయాను రా బాబోయ్ ” అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ వీడియో ఇప్పుడు మాట్లాడింది కాదు. దాదాపు 8 – 9 ఏళ్ల క్రితం మాట్లాడిన వీడియో .

అయితే సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు కావాలని ఈ వీడియోని మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో బన్ని ఫాన్స్ లో ఆడేసుకుంటున్నారు . ఆశ్చర్యం ఏంటంటే ప్రజెంట్ బన్నీ నటిస్తున్న పుష్ప2 సినిమాలో అనసూయ నటిస్తుంది . ఒకప్పుడు ఆ మాటలు మాట్లాడిన అనసూయ మరి బన్నీ సినిమాలో అవకాశం వస్తే ఎలా చేసింది? అవకాశాల కోసం ఎంతకైనా మారిపోతారా ఈ బ్యూటీలు..? అంటూ రెచ్చిపోతున్నారు . మరికొందరు అల్లు అర్జున్ ని సైతం ట్రోల్ చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనసూయ పై గుర్రుగా ఉంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి అనసూయ ఓల్డ్ వీడియోతో భళే ఇరుక్కునేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news