Moviesపుష్ప 2 నుండి క్రేజీ డైలాగ్ లీక్.. దీనమ్మ ఇక బాక్స్...

పుష్ప 2 నుండి క్రేజీ డైలాగ్ లీక్.. దీనమ్మ ఇక బాక్స్ ఆఫిస్ బద్ధలవ్వాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో తమ సినిమాల గురించి పక్క హీరోలు లీక్ చేసే మ్యాటర్స్ కన్నా తమ సినిమా గురించి ఆ హీరోసే మ్యాటర్ లీక్ చేసుకుంటూ వస్తూ ఉండడం.. సరికొత్త ట్రెండ్గా మారింది . దీనికి నాంది పలికింది మెగాస్టార్ చిరంజీవి . సోషల్ మీడియా వేదిక ద్వారా చిరు లీ.. క్స్ అంటూ ట్రెండ్ చేస్తూ తన సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను సినిమా రిలీజ్ కంటే ముందే ఓపెన్ గా చెప్పేసుకుంటూ ఉండడం అభిమానులకి తెగ నచ్చేసింది .

రీసెంట్గా అదే ట్రెండ్ ఫాలో అయిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. మల్టీ టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కాగ ఈ సినిమా నుంచి ఒక్కటైనా డైలాగ్ లీకైతే బాగుండు అని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . కాగ అల్లు అర్జున్ బేబీ సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ..అల్లు అర్జున్ స్టేజ్ పైనే ఒక క్రేజీ డైలాగ్ ను లీక్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో క్రేజీ డైలాగ్ వైరల్ గా మారింది

బన్నీ మాట్లాడుతూ.. పుష్ప2 గురించి అప్డేట్ ఇవాల్సి వస్తుందనుకోలేదు. చిరు లీక్స్ లాగే నేను ఓ డైలాగ్ లీక్ చేస్తున్నాను. ‘ఈడంతా జరిగేది ఒక్కటే రూల్ మీద జరుగుతండాది.. పుష్ప గాడి రూల్’ అంటూ పవర్ ఫుల్ గా డైలాగ్ ను పంచుకున్నారు. అయితే, ‘పుష్ప : ది రైజ్’లో ‘తగ్గేదెలే’, ’పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా’ వంటి డైలాగ్స్ ఎంతలా ట్రెండ్ అయ్యాయో తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news