Movies"మగాడిలా ఉందంటూ దారుణంగా అవమానించారు"..వరలక్ష్మి శరత్ కుమార్ బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

“మగాడిలా ఉందంటూ దారుణంగా అవమానించారు”..వరలక్ష్మి శరత్ కుమార్ బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో అవమానాలు చాలా కామన్ . ఎంతటి పెద్ద స్టార్ హీరో కైనా.. హీరోయిన్ కైనా.. అవమానాలు జరగనిదే.. ఆ స్టార్ పొజిషన్ కి వెళ్లలేరు. అయితే అలాంటి అవమానాలు కేవలం ఇండివిడ్యువల్ గా వచ్చిన స్టార్స్ కి ఉంటాయంటే నో అని చెప్పాలి . స్టార్ హీరో కూతుర్లకి కొడుకులకి కూడా ఇలాంటి అవమానాలు జరిగాయి. తాజాగా అలాంటి అవమానాన్ని బయటపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్ .

తనని చాలా హర్ట్ చేశారు ఒకరు అంటూ పేరు చెప్పకుండానే చాలా గట్టిగా ఇచ్చి పడేసింది. సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో విలన్ పాత్రలు చేస్తూ రాణిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” కెరియర్ స్టార్టింగ్ లో తన సినిమాలకి తాను డబ్బింగ్ చెప్పుకుంటాను.. అన్నప్పుడు కొందరు డైరెక్టర్లు ఆమె గొంతు బాగోలేదని.. మగ రాయుడిలా ఉంది” అంటూ అవమానించారని చెప్పుకొచ్చింది.

“ఆ తర్వాత నా గొంతుకి కూడా నా నటనతో ఈక్వల్ గా అభిమానులు ఏర్పడ్డారని.. ఇప్పుడు నా గొంతుకి కూడా పిచ్చ ఫాన్స్ ఉన్నారని చెప్పుకుంటూ సంతోషపడింది. కేవలం తనే కాదు సినిమా ఇండస్ట్రీలో కొందరు పనికిమాలిన బిహేవియర్ కారణంగా.. కొందరు స్టార్స్ చాలా ఇబ్బందులు పడ్డారని “సంచలన కామెంట్స్ చేసింది . ప్రజెంట్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news