Moviesఇంటికి వచ్చిన "ఆది పురుష్" సినిమాను చేతుల్లారా వదులుకున్న దురదృష్టవంతుడు ఈయనే..!!

ఇంటికి వచ్చిన “ఆది పురుష్” సినిమాను చేతుల్లారా వదులుకున్న దురదృష్టవంతుడు ఈయనే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఆదిపురుష్ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఆది పురుష్. కృతి సనన్ ఇందులో సీత పాత్రలో మెరవగా.. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ విజృంభించేశాడు. భారీ తారాగాణంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది .

కధ అందరికీ తెలిసిన రామాయణం నే అయినా ఈ కాలం జనరేషన్ కి యూత్ కి అర్థమయ్యే విధంగా ఓంరావత్ చాలా క్లియర్ గా తెరకెక్కించారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . అదే క్రమంలో నాసిరకం విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ద్వారా సినిమాకి కొంచెం నెగటివ్ టాక్ కూడా క్రియేట్ అయింది . ఇలాంటి క్రమంలోనే ఆది పురుష్ సినిమాను చేతులారా రిజెక్ట్ చేసుకున్న స్టార్ హీరో పేరుని ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . అంతేకాదు సినిమాలో రొమాంటిక్ సీన్స్ లేవు అంటూ ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేయడం ఫన్నీగా అనిపిస్తుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు .

ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ . ముందుగా హృతిక్ రోషన్ కి ఓం రావత్ ఈ కధను వివరించారట . అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ లేకపోవడం ..రొమాంటిక్ సీన్స్ లేకపోవడంతో.. హృతిక్ రోషన్ సినిమా రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత పలువురు బాలీవుడ్ హీరోలు ఈ పాత్రకి అనుకున్నప్పటికీ ప్రభాస్ అయితే సూట్ అవుతాడు .. ఆ హైట్ కి ఆ వెయిట్ కి కరెక్ట్ అంటూ ఓం రావత్ ఆయన వద్దకు వెళ్లి స్టోరీ చెప్పారట . ప్రభాస్ కి కథ నచ్చడంతో ఓకే చేసి సినిమాను సూపర్ హిట్ గా మలుచుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news