Moviesప్రభాస్ "ఆదిపురుష్" హిట్టా-ఫట్టా..? రిజల్ట్ ని ముందే చెప్పేసిన వేణుస్వామీ ..!!

ప్రభాస్ “ఆదిపురుష్” హిట్టా-ఫట్టా..? రిజల్ట్ ని ముందే చెప్పేసిన వేణుస్వామీ ..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. కాగా రీసెంట్ గానే తిరుపతిలో ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం . సినిమాకి సూపర్ బజ్ క్రియేట్ చేసింది . కాగ ఇలాంటి క్రమంలోనే పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఆది పురుష్ సినిమాకి సంబంధించిన టికెట్లను కొని పేద ప్రజలకు అనాధ శరణాలయాలకు డొనేట్ చేస్తున్నారు .

దీంతో సినిమాపై హ్యూజ్ రేంజ్ లో మార్కెటింగ్ జరుగుతుంది . కాగా ఇలాంటి సమయంలోనే ఆది పురుష్ సినిమా హిట్టా – పట్టా అంటూ జాతకాన్ని ఓపెన్ గా చెప్పేసాడు ఆస్ట్రాలజర్ వేణు స్వామి . ఈ మధ్యకాలంలో వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. ఆయన చెప్పింది తూచా తప్పకుండా జరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ జనాల్లో నెలకొంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆది పురుష్ సినిమా రిజల్ట్ పై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులకు మండిస్తున్నాయి .

ఆయన ఏమన్నారంటే ..”ప్రభాస్ జాతకాన్ని బేస్ చేసుకుని చూస్తే ఆది పురుష్ సినిమా పెద్ద హిట్ అవ్వదు. ఏదో ఆయన అభిమానులకు మాత్రం నచ్చగలుగుతుంది అంతేకానీ బాహుబలి స్థాయిని ఎక్స్పెక్ట్ చేయకూడదు . నిజానికి ఆ సత్తా ఆదిపురుష్ సినిమాకు లేదు . కేవలం ఓ వర్గం జనాలను మాత్రమే ఆకట్టుకుంటుంది. యావరేజ్ రిజల్ట్ అయితే సొంతం చేసుకోబోతుంది “అంటూ చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో ఆదిపురుష్ రిజల్ట్ పై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news