Moviesకోక పైకెత్తి కేకపెట్టిస్తున్న అంజలి.. "బహిష్కరణ" ఊర మాస్ లుక్ వైరల్..!!

కోక పైకెత్తి కేకపెట్టిస్తున్న అంజలి.. “బహిష్కరణ” ఊర మాస్ లుక్ వైరల్..!!

అంజలి .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకు తెలుగు బ్యూటీ నే అయినా కోలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమా అవకాశాలు సంపాదించుకొని .. అక్కడ వచ్చిన పాపులారిటి తో తెలుగులో సినిమాలు అందుకొని ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ప్రజెంట్ హీరోయిన్ అంజలి పేరు చెప్తే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఓ తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతూ వస్తుంది. అంతలా మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ గా పేరు సంపాదించుకున్న అంజలి పుట్టినరోజు నేడు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆమె ఫాన్స్ ..ఫ్రెండ్స్.. ఫ్యామిలీ మెంబర్స్.. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే అంజలి బర్త డే సందర్భంగా ఆమె నెక్స్ట్ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. “బహిష్కరణ” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో అంజలి చాలా చాలా బోల్డ్ లుక్ లో కనిపించబోతుంది .

రిలీజ్ అయిన పోస్టర్ ఆధారంగా అంజలి నోట్లో పాన్ వేసుకొని ..కుర్చీపై కాళ్లు పెట్టి ఊర మాస్ లుక్ లో కనిపించింది. ఈ క్రమంలోనే అంజలి ఈ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా కనిపించబోతుంది అంటున్నారు అభిమానులు . అంతేకాదు అంజలి ఈ బోల్డ్ లుక్ లో మహా మహా హీట్ పుట్టించేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అంజలి బహిష్కరణ ఫస్ట్ లుక్ పిక్స్ వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news