Movies"బన్నీ ని బాగా కొట్టాలి అని ఉంది".. సుబ్బరాజు షాకింగ్ కామెంట్స్...

“బన్నీ ని బాగా కొట్టాలి అని ఉంది”.. సుబ్బరాజు షాకింగ్ కామెంట్స్ కి సపోర్ట్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న సుబ్బరాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో పలు రోల్స్ చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు . మరి ముఖ్యంగా సుబ్బరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ని అభిమానుల తెగ వైరల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే చూడటానికి హీరో కటూట్ లో ఉండే సుబ్బరాజు.. ఇందస్ట్రీలో ఎన్నో మంచి పాత్రల్లో మెరిసారు.

మరి ముఖ్యంగా మిర్చి, బాహుబలి సినిమాలల్లో నటించి..తన పేరును మారుమ్రోగిపోయేలా చేసుకున్న ఈయన గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్ని ని కొట్టాలి అని ఉంది అంటూ సుబ్బరాజు చెప్పుకువచ్చారు. హోస్ట్ నుంచి ఆయనకు ఎదురైన ప్రశ్నకు ది పర్ ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. హోస్ట్ ప్రశ్నిస్తూ..” మీరు విలన్ గా చేయాలనుకుంటే మీ అపోజిషన్ లో ఏ హీరో ఉండాలి అనుకుంటారు..?” అని ప్రశ్నించగా…

ఆయన సమాధానమిస్తూ..” నేను ఇప్పటివరకు అల్లు అర్జున్ తో చేయలేదు. ఆయనతో ఫైట్ చేయాలని.. ఆయనను కొట్టే సీన్స్ చేయాలని ..నాకు ఇంట్రెస్ట్ గా ఉంది . బన్నీ తో ఒక్కసారి అయిన ఫైట్ చేసే ఛాన్స్ వస్తే బాగుండు, దేశ ముదురు సినిమాలో మా మధ్య సీన్స్ ఉన్నా..నాకు సాటిస్ ఫై అవ్వలేదు..ఫుల్ లెంత్ ఫైట్స్ పడితే బాగుంటుంది”..అంటూ చెప్పుకు వచ్చాడు. అంతేకాదు మీరు హీరోగా – విలన్ గా – క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఏ పాత్రలో సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు ..అనగా నేను క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నాను అంటూ చెప్పుకు వచ్చారు. ఫ్యాన్స్ కూడా సుబ్బరాజు కోరిక తీరాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి అల్లు అర్జున్ – సుబ్బరాజు కాంబో ని ఏ డైరెక్టర్ సెట్ చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news