Moviesఆ హీరోయిన్ తో కృష్ణం రాజుకు ఎఫైర్ ఉంద‌ని.. ఫ్యామిలిలో అనుమానాలు..?

ఆ హీరోయిన్ తో కృష్ణం రాజుకు ఎఫైర్ ఉంద‌ని.. ఫ్యామిలిలో అనుమానాలు..?

సినిమా రంగం అనేది గ్లామర్ ప్రపంచం. సినిమా రంగంలో హీరోలు హీరోయిన్లు చాలా సన్నిహితంగా ఉంటారు. అంతలోనే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇక హీరోలు హీరోయిన్ లు ప్రేమించుకోవడం, విడిపోవడం కామన్ గా నడుస్తూ ఉంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హీరో హీరోయిన్ల మధ్య బంధాలు మరీ పలచబడిపోయాయి. ఎంత త్వరగా ప్రేమించుకుంటున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. అయితే తెలుగు సినిమా రంగంలో 40, 50 సంవత్సరాల క్రితం కూడా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయ‌ణాలు నడిచాయి.

మరికొందరు హీరో హీరోయిన్ల మధ్య సంథింగ్ సంథింగ్ ఉందన్న పుకార్లు కూడా వినిపించాయి. అలాంటి వారిలో రెబల్ స్టార్ కృష్ణంరాజు – వాణిశ్రీ ఒకరు. కృష్ణంరాజు తన సొంత బ్యానర్ లో తెరకెక్కించిన కృష్ణవేణి అనే సినిమాలో వాణిశ్రీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమాలో వాణిశ్రీ.. కృష్ణంరాజును డామినేట్ చేసి మరి నటించారు. విక్టరీ మధుసూదన్ రావు ఈ సినిమాకు దర్శకులు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే సినిమాలో 70% పాత్ర వాణిశ్రీ కి ఉంటే కృష్ణంరాజుకు కేవలం 30 శాతం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో భక్తకన్నప్ప సినిమా కూడా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

కృష్ణంరాజు వరుసగా వాణిశ్రీని తన సినిమాలలో రిపీట్ చేయడంతో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కృష్ణంరాజును అనుమానించారట. ఏంటి వరుసగా వాణిశ్రీని హీరోయిన్ గా తీసుకుంటున్నారు పైగా మీ సినిమాలలో మీకంటే ఆమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని కృష్ణంరాజుతో అప్పుడప్పుడు వాదించే వారట.. అయితే కృష్ణంరాజు మాత్రం సినిమాలో కథను బట్టి ఎవరి పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉండాలో దర్శకుడు నిర్ణయిస్తారు గాని నేను ఆ విషయంలో జోక్యం చేసుకోనని చెప్పేవారట.

ఆ సమయంలోనే కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కాస్త కృష్ణంరాజు – వాణిశ్రీ స్నేహాన్ని అనుమానించారన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి. ఇక కృష్ణంరాజుకు వాణిశ్రీ తో పాటు సహజనటి జయసుధ అన్నా కూడా చాలా ఇష్టం. వీరిద్దరి నటనను ఆయన ఎక్కువగా ఇష్టపడుతూ ప్రశంసించేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news