Moviesఎన్టీఆర్ బర్త డే స్పెషల్: ఎన్ని పనులు ఉన్నా.. ప్రతి పుట్టినరోజుకు...

ఎన్టీఆర్ బర్త డే స్పెషల్: ఎన్ని పనులు ఉన్నా.. ప్రతి పుట్టినరోజుకు తారక్ ఖచ్చితంగా అలా చేస్తాడు.. పులి బిడ్డ అనిపించాడుగా..!!

నేడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు . ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఆయన ఇంటి వద్ద కేక్ కటింగ్ అంటూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలిపోయారు . కాగా ప్రజెంట్ ఎన్టీఆర్ ఎలాంటి క్రేజీ పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో రికార్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ..తన కంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

ప్రెసెంట్ తారక్ కొరటాల శివ డైరెక్షన్లో ” దేవర” అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్.. టైటిల్ పోస్టర్ ను నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు మేకర్స్. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బర్త్డేకి సంబంధించిన స్పెషల్ న్యూస్ వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తన బర్త డే ని చాలా ట్రెడిషనల్ గా సెలెబ్రేట్ చేసుకుంటారట . నిజానికి ఈ కేక్ కటింగ్ .. గిఫ్ట్స్.. దెకరేషన్స్ ..పార్టిలు పెద్దగా ఇష్టం ఉండవట.

తన ప్రతి పుట్టినరోజుకి ఉదయానే నూనెతో తల అంటుకుని.. సున్నిపిండి పట్టి స్నానం చేసుకుంటాడని ..అది కూడా అమ్మ స్పెషల్గా చేయిస్తుందని.. ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాడట .ఆశ్చర్యం ఏంటంటే చిన్నప్పుడే కాదు ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇలాగే చేస్తారట . ఇప్పటికి తారక్ తల్లి కోసం ఇలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతాడా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . మరి కొందరు తారక్ బ్లడ్ లోనే అలాంటి సంప్రదాయాలను ఫాలో అయ్యే గుణం ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. కాగా హరికృష్ణ కూడా మొదటి నుంచి సాంప్రదాయాలను ఎక్కువుగా ఫాలో అయ్యేవాడట. మరి ముఖ్యంగా పెద్దలు ఏది చెప్తే అదే చేసేవారట. తారక్ కూడా అలాగే చేయడంతో ..తారక్ ను పులి బిడ్డ అంటూ ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news