Movies' ఆదిపురుష్ ట్రైల‌ర్ టాక్... పూన‌కాలు నిజంగా వ‌చ్చాయా... అంతా...

‘ ఆదిపురుష్ ట్రైల‌ర్ టాక్… పూన‌కాలు నిజంగా వ‌చ్చాయా… అంతా ఉత్తుత్తిదేనా..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సాహో, రాధేశ్యామ్ లాంటి రెండు ప్లాపుల త‌ర్వాత ప్రభాస్ నుంచి వ‌స్తోన్న సినిమా ఇది. పైగా పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమా అయితే మామూలు హైప్ క్రియేట్ చేయ‌ట్లేదు.

అయితే సిన‌మా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ అయిన స్టిల్స్‌తో పాటు వీడియోలు అన్నీ కూడా కాస్త డిజ‌ప్పాయింట్మెంట్‌గానే క‌నిపిస్తున్నాయి. తాజాగా ట్రైల‌ర్ కొంద‌రు చూసేశారు. ఏదో సందుల్లోనుంచి, త‌ల‌కాయ‌ల మ‌ధ్య‌లోనుంచి వీడియోలు తీసి బ‌య‌ట‌కు వ‌దిలేశారు. ట్రైల‌ర్ అయితే పిల్ల‌ల‌ను, పెద్ద‌ల‌ను ఆక‌ట్టుకునేలా క‌ట్ చేసిన‌ట్టుగా ఉంది.

గ్రాఫిక్స్ మీద మంచి స్టోరీ బోర్డ్ వేసుకుని పిక్చ‌రైజ్ చేసిన‌ట్టుగా ఉంది. మ‌న‌కు తెలిసున్న క‌థే అయినా.. రామ‌య‌ణ‌మే అయినా ఫ్రేమ్‌లు, గ్రాఫిక్స్ యాడ్ చేసి కాస్త జాగ్ర‌త్త ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. రామాయ‌ణంలోని యుద్ధ‌కాండం మీద ఎక్కువుగా కాన్‌సంట్రేష‌న్ చేసిన‌ట్టుగా ఉంది. అయితే ఆ గ్రాఫిక్స్ అంతా కూడా యానిమేష‌న్ వ‌ర్క్‌లా ఉంది.

అస‌లు ట్రైల‌ర్లో ఏం జ‌రుగుతోంది… ఎవ‌రు ఏ పాత్ర‌ధారో తెలుసుకోవ‌డ‌మే క‌ష్టం అన్న‌ట్టుగా ఉంది. సీత పాత్ర కూడా ఏమంత ఆస‌క్తిగా లేదు. అయితే పూర్తి 3 డీ ట్రైల‌ర్ వ‌స్తే కానీ ఇది ఎలా ఉంద‌న్న‌ది క్లారిటీ రాదు. ఇప్పుడు బ‌య‌ట వైర‌ల్ అవుతున్న‌వి పైరేటెడ్ ట్రయిలర్ వీడియోలే.

టీజ‌ర్‌తో పోలిస్తే చిన్న చిన్న మార్పులు చేసినా కూడా సినిమాపై మ‌రీ ప్ర‌భాస్ రేంజ్ పాన్ ఇండియా ఆస‌క్తి అయితే క్రియేట్ కావ‌డం లేదు. మ‌రి పూన‌కాలు అయితే వ‌చ్చే సీన్ క‌న‌ప‌డడం లేదు. పూర్తి ట్రైల‌ర్ వ‌స్తే కాని సినిమా ఎలా ఉండ‌బోతోందో ఓ అంచ‌నాకు రాలేం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news