Moviesడబ్బుకోసమే ఐశ్వర్య రాయ్ అభిషేక్ ను పెళ్లి చేసుకుందా...పెళ్లికి ముందే ఇన్ని...

డబ్బుకోసమే ఐశ్వర్య రాయ్ అభిషేక్ ను పెళ్లి చేసుకుందా…పెళ్లికి ముందే ఇన్ని ఎఫైర్లు ఉన్నాయా ?

ఐశ్య‌ర్యరాయ్ ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. కుర్రాళ్ల నుండి ముస‌లివాళ్ల వ‌ర‌కూ ఎవ్వ‌రినీ అడిగినా ప్రపంచ సుంద‌రి అని ట‌క్కున చెప్పేస్తారు. ఐశ్వ‌ర్య అందానికి ప్రపంచ సుంద‌రి కిరీట‌మే దిగి వ‌చ్చింది అంటే ఆమె అందాన్ని ఎంత వ‌ర్ణించినా త‌క్కువే అని అర్థం. ప్ర‌పంచ సుంద‌రిగానే కాకుండా నీలి క‌ళ్ల ఐశ్ సినిమాల‌లోనూ రానించింది. బాలీవుడ్ లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రోబో లాంటి సినిమాతో అన్ని భాష‌ల్లోనూ అభిమానుల‌ను సంపాదించుకుంది.

అయితే ఐశ్ సినిమాల ప‌రంగా ఎంతో కెరీర్ ఉన్న‌ప్ప‌టికీ పెళ్లి చేసుకుని అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ్యామిలీకి కోడలుగా వెళ్లింది. హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ కు భార్య అయ్యింది. అయితే ఒకప్పుడు ఐశ్ హీరోయిన్ గా కంటే ఎఫైర్ ల‌తోనే ఎక్కువ హాట్ టాపిక్ గా ఉండేది. చాలా మందితో ఐశ్ ల‌వ్ ఎఫైర్లు న‌డిపింది. అప్ప‌ట్లో ఐశ్ గోల్డ్ డిగ్గ‌ర్ అనే పేరును సైతం సంపాదించుకుంది. బ్యూటీ విత్ బ్రైన్..ఎక్క‌డ డ‌బ్బుంటే అక్క‌డే వాలిపోతుంద‌ని ఐశ్ ను విమ‌ర్శించేవారు.

ఇక గ‌తంలో ఈ అమ్మ‌డి ఎఫైర్ ల పై ఒక లుక్ వేద్దాం….ఇంట‌ర్ లోనే ఐశ్ మోడ‌లింగ్ లోకి వ‌చ్చింది. ఆ త‌ర‌వాత స‌ల్మాన్ ఖాన్ తో మొద‌ట ల‌వ్ ఎఫైర్ న‌డిపించింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. దాంతో బ్రేక‌ప్ చెప్పుకున్నారు. అయితే స‌ల్మాన్ ఖాన్ సైకో చేస్ట‌ల వ‌ల్ల బ్రేక‌ప్ జ‌రిగింద‌ని అంతా అనుకున్నారు. స‌ల్మాన్ ఖాన్ ఫోన్ లో ఐశ్ ను తిట్టిన ఆడియో కూడా లీక్ అయ్యింది. ఓ రోజు స‌ల్మాన్ ఖాన్ ఐశ్ ఇంటికి తాగిన‌మ‌త్తులో వెళ్లి ర‌చ్చ చేశాడు కూడా.

ఆ త‌ర‌వాత న‌టుడు వివేక్ ఒబేరాయ్ తో ప్రేమాయ‌ణం మొద‌లు పెట్టింది. వివేక్ ఒబేరాయ్ తో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టింది. దాంతో స‌ల్మాన్ ఖాన్ ను కేవ‌లం త‌న కెరీర్ లో ఎదుగుద‌ల‌కు ఐశ్ వాడుకుంద‌ని అవ‌మానించారు. మ‌రోవైపు స‌ల్మాన్ ఖాన్ వివేక్ ఒబేరాయ్ ని బాలీవుడ్ లో ఎద‌కుండా తొక్కేసే ప్ర‌య‌త్నం కూడా చేశాడు. ఓసారి వివేక్ ఒబేరాయ్ తాను ఐశ్ తో ల‌వ్ లో ఉండ‌టం వ‌ల్ల‌నే స‌ల్మాన్ వేధిస్తున్నాడంటూ ఆరోపించాడు. దాంతో ఐశ్ ప్లేట్ ఫిరాయించింది. త‌న‌ను ఇష్యూలోకి లాగొద్దంటూ స్ప‌ష్టం చేసింది.

అక్క‌డితో వివేక్ తో కూడా లవ్ కి ఎండ్ కార్డ్ ప‌డిపోయింది. ఇక ఆ త‌ర‌వాత ఓ సినిమా కోసం ఫోటో షూట్ లో ఐశ్వ‌ర్య‌రాయ్ అభిషేక్ ల‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. న్యూయార్క్ లో మొద‌టిసారి ఐశ్ కు అభిషేక్ బ‌చ్చ‌న్ ప్ర‌పోజ్ చేశాడు. ఆ త‌ర‌వాత మూడు నెల‌ల‌కే అభిషేక్ బ‌చ్చ‌న్ ఐశ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి త‌ర‌వాత ఐశ్ ఎప్పుడూ ఇత‌ర వ్య‌క్తుల‌తో ప్రేమాయ‌ణాలు కొన‌సాగించ‌లేదు. అయితే వ‌య‌స్సులో త‌న‌కంటే యేడాది చిన్నోడు అయిన అభిషేక్‌ను కేవ‌లం డ‌బ్బు కోస‌మే పెళ్లి చేసుకుంద‌న్న పుకార్లు ఆమెపై అప్ప‌ట్లో వ‌చ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news