Moviesబిగ్ బ్రేకింగ్‌: ప్ర‌భాస్ ' ఆదిపురుష్ ' ట్రైల‌ర్‌.. ఫ్యీజులు ఎగిరిపోయేలా.....

బిగ్ బ్రేకింగ్‌: ప్ర‌భాస్ ‘ ఆదిపురుష్ ‘ ట్రైల‌ర్‌.. ఫ్యీజులు ఎగిరిపోయేలా.. గూస్‌బంప్స్ మోతే

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా పాన్ ఇండియా ప్రాజెక్టుల‌లో న‌టిస్తున్నాడు. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ ఇమేజ్ నేష‌న‌ల్ వైడ్‌గా మార్మోగుతోంది. ఆ త‌ర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాలు కూడా నేష‌న‌ల్ లెవ‌ల్లో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ చేస్తోన్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా లెవ‌ల్ సినిమాలే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి అంచనాలు ఉన్న మోస్ట్‌ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్”

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ – కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెర‌కెక్కించారు. తానాజీ సినిమాతో ఓం రౌత్ బాగా పాపుల‌ర్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇప్ప‌టికే ఒక్కో అప్‌డేట్ వ‌దులుతూ వ‌స్తున్నారు.

తాజాగా ఇప్పుడు ట్రైలర్ కి సంబంధించి బాలీవుడ్ వర్గాలు నుంచి క్రేజీ బజ్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ ట్రైల‌ర్ క‌ట్ సుమారు 3.22 నిమిషాల పాటు ఉండేలా క‌ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ట్రైల‌ర్ అంతా నెక్ట్స్ లెవ‌ల్లో ఉంటుందని.. ట్రైల‌ర్లో ప్ర‌తి సెక‌న్‌.. ప్ర‌తి షాట్ గూస్‌బంప్స్ మోత మోగిపోయేలా సిద్ధం చేశార‌ని అంటున్నారు.

ఈ సినిమా మేక‌ర్స్ ఈ సినిమాను కూడా థియేట‌ర్ల‌లో అది కూడా 3 డి వెర్ష‌న్ల‌లో సిద్ధం చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇక ఈ బిగ్గి సినిమాను జూన్ 16న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ యేడాది సెప్టెంబ‌ర్ 28న ప్ర‌భాస్ స‌లార్ సినిమా కూడా థియేట‌ర్ల‌లోకి దిగ‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news