Moviesవిడాకుల నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న నిహారిక.. సోషల్ మీడియా వేదికగా...

విడాకుల నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న నిహారిక.. సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి సక్సెస్ కాలేక ఇంట్లో చెప్పిన సంబంధాన్ని చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది అనుకున్నా మెగా ఫాన్స్ కి నిహారిక బిగ్ రాడ్ దించేసింది . రీసెంట్ గానే నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అన్న రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి మెయిన్ రీజన్ నిహారికతో పెళ్లి జరిగిన పిక్స్ చైతన్య డిలీట్ చేయడం.. ఆ తర్వాత కొన్ని రోజులకే చైతన్యతో పెళ్లి జరిగిన పిక్స్ నీహారిక డిలిట్ చేయడం తో అభిమానులు ఈ జంట మధ్య ఏదో తేడా కొట్టిందని .. అందుకే విడాకులు తీసుకోబోతున్నారు అని ఫిక్స్ అయిపోయారు .

కాగా ఇలాంటి క్రమంలోనే నిహారిక ఇలాంటి రూమర్స్ పై రియాక్ట్ అవ్వకుండా హైదరాబాదులో కొత్త ఆఫీస్ ను ఓపెన్ చేసింది . మనకు తెలిసిందే నిహారిక ఈ మధ్యకాలంలో పలు సినిమాలను ప్రమోట్ చేస్తూ నిర్మాణం వైపు అడుగులు వేస్తుంది . ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ మూవీస్ నిర్మిస్తున్న నీహారిక.. ఓ అడుగు ముందుకు వేసింది.

ఇందుకోసం ఓ ఆఫీసును ఓపెన్ చేశారు . అయితే విడాకుల టైం లో ఓపెన్ చేయడం ప్రధాన్యత సంతరించుకుంది . అయితే అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక ఒకరి మీద డిపెండ్ అవ్వాలని అనుకోవట్లేదు అని .. తాను ఇండిపెండెంట్ గర్ల్ గా ఉండాలని అనుకుంటుదని.. అందుకే ఇలా కొత్త ఆఫీస్ ఓపెన్ చేసి తన టాలెంట్ ను జనాలకు చూపించాలని అమ్మడు చాలా కష్టపడుతుందట. కాగా తన ప్రొడక్షన్ కంపెనీ కి సంబంధించిన కొత్త ఆఫీస్ ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు . అయితే నిహారిక ప్రయత్నం సక్సెస్ కావాలని ఆమె లైఫ్ లో మరింత ముందుకు వెళ్లాలని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు. మరికొందరు ఆమెను పచ్చి బూతులతో ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news