Moviesద‌స‌రా సినిమాకు మ‌హేష్‌బాబు రివ్యూ చూసి అదిరే రిప్లై ఇచ్చిన నాని

ద‌స‌రా సినిమాకు మ‌హేష్‌బాబు రివ్యూ చూసి అదిరే రిప్లై ఇచ్చిన నాని

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ దసరా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మించారు. శ్రీరామనవమి కానుకగా పలు భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు.. తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ మాస్ రెస్టిక్ ఎంటర్టైనర్ లో నాని, కీర్తి సురేష్ నటన నభూతో నఃభవిష్యత్ అన్నట్టుగా ఉంది. అలాగే సంతోష్ నారాయణ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఇక గత రాత్రి ఈ సినిమాను ప్రత్యేకంగా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దసరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ మూవీ గురించి అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. దసరా మూవీ చూశాను.. చాలా స్ట‌న్నింగ్‌గా ఉంది. నిజంగా ప్రతి ఒక్కరు గర్వపడాల్సిన సినిమా అంటూ మహేష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిజంగా మహేష్ పెట్టిన ఈ కామెంట్ దసరా సినిమాకు చాలా బూస్టప్‌ ఇస్తుందని కచ్చితంగా చెప్పాలి. ఇక దసరా సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించడంతో.. నాని కూడా మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మహేష్‌కు సినిమా విషయంలో థాంక్స్ చెప్తూ మీరు మంచి సినిమాల పట్ల ఇచ్చే వాయిస్ సపోర్ట్ ఎలా ? ఉంది అంటే పోకిరి సినిమాకి మణిశర్మ గారి స్కోర్ అందించినట్టుగా ఉంటుంది అని అదే రిప్లై ఇచ్చాడు.

దీంతో మహేష్ ఫ్యాన్స్ అయితే నానిని పొగుడుతూ మరింత ఖుషీ అవుతున్నారు. నాని రిప్లై మామూలుగా లేదని కామెంట్లు పెడుతున్నారు. ఇక మ‌హేష్ ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news