Moviesజ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌ల‌కు ఇన్నేసి పెళ్లిళ్లు జ‌రిగాయా…!

జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌ల‌కు ఇన్నేసి పెళ్లిళ్లు జ‌రిగాయా…!

ఒక‌ప్పుడు ఉత్త‌రాది హీరోయిన్ల పెళ్లిళ్ల‌పై అనేక క‌థ‌నాలు వ‌చ్చేవి. ఒక హీరోయిన్ అనేక మందిని పెళ్లి చేసుకుంద‌ని.. త‌ర్వాత‌.. వ‌రుస విడాకులు ఇచ్చింద‌ని..ఇ లా అనేక స్టోరీలు ప్రేక్ష‌కుల‌కు విందు చేసేవి. అంతేక‌దా.. సెల‌బ్రిటీల జీవితాల్లోని ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు ఏవైనా కూడా.. ప్రేక్ష‌కుల‌కు విందు చేస్తాయి. అదేవిధంగా తెలుగు సినీ ప్ర‌పంచంలోనూ.. ఇలాంటి ఆస‌క్తిక‌ర విష‌యాల కోసం ఎదురు చూసే ప్రేక్ష‌కులు అనేకమంది ఉన్నారు.

ఇక‌, తెలుగు సినిమాల్లో ఒక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌ను ఊపేసిన వారిలో జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌లు కూడా ఇదే రేంజ్‌లో గ్యాసిప్‌ల‌లో ఊగితేలారు. జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌లు క‌లిసి న‌టించిన సినిమాలు అనేకం ఉన్నాయి. జ‌యసుధ దాదాపు తెలుగు సినీ ప్ర‌పంచానికే ప‌రిమితం అయ్యారు. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు హిందీ సినిమాలు చేసినా.. ఎక్కువ భాగం.. జ‌య‌సుధ తెలుగు సినిమాల‌కే ప‌రిమితం అయ్యారు.

కానీ, జ‌య‌ప్ర‌ద మాత్రం తెలుగు నుంచి హిందీలోకి వెళ్లి.. అక్క‌డే దాదాపు స్థిర ప‌డిపోయారు. 1990ల‌నుంచి ఆమె తెలుగు సినిమాల్లో న‌టించ‌లేదు. కానీ, జ‌య‌సుధ మాత్రం.. అనేక సినిమాల్లో న‌టించారు. తెలుగులో వ‌చ్చిన వాటిలో త‌ల్లి, అత్త పాత్ర‌లు కూడా పోషించారు. అయితే.. వీరిద్ద‌రి జీవితాల గురించి అనేక గ్యాసిప్‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా వైవాహిక జీవితాల గురించి అయితే.. చెప్ప‌లేన‌న్ని క‌థ‌లు హ‌ల్చ‌ల్ చేశాయి.

జ‌య‌సుధ ముగ్గురిని వివాహం చేసుకుంద‌ని.. కాదు.. ఇద్ద‌రిని పెళ్లి చేసుకుంద‌ని.. కూడా క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. ఇక‌, జ‌య‌ప్ర‌ద అస‌లు పెళ్లి చేసుకోలేద‌ని.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని అంటారు. రాజ‌కీయాల్లోకి రావ‌డం వ‌ర‌కు తెలుసు. కానీ.. పెళ్లి విష‌యం మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే. ఒక పార్టీ అధినేత‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని.. స‌హ‌జీవ‌నం చేసింద‌నే ప్ర‌చారం కూడా ఉంది.

ఇక‌, జ‌య‌సుధ , జ‌య‌ప్ర‌దల పెళ్లిళ్ల మాట ఎలా ఉన్నా.. వీరి పిల్లల విష‌యం కూడా అంతే రేంజ్‌లో చ‌ర్చ‌కు వ‌చ్చేది. వీరి పిల్లల విష‌యం ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలియ‌దు. జ‌య‌సుధ ఇటీవ‌ల ఎవ‌రితోనూ వివాహేత‌ర సంబంధం పెట్టుకుని.. ఫారిన్ వ్య‌క్తితో ఉంటోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆమె దానిపై క్లారిటీ ఇచ్చారు. అయినా.. కూడా అవి ఆగ‌లేదు. ఇక‌, జ‌య‌ప్ర‌ద‌కు అస‌లు పెళ్లే కాలేద‌న్న చ‌ర్చ ఉంది. అయినా.. పిల్లల గురించి కూడా త‌ర‌చుగా చ‌ర్చ వ‌స్తూనే వుంది. అయితే.. ఇద్ద‌రూ కూడా దీనిపై మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. సంగతి!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news