MoviesNTR ఎన్టీఆర్ - కెవి. రెడ్డి మ‌ధ్య కుంప‌ట్ల రాజేసిన వారికి...

NTR ఎన్టీఆర్ – కెవి. రెడ్డి మ‌ధ్య కుంప‌ట్ల రాజేసిన వారికి చెప్పు దెబ్బ లాంటి ఆన్స‌ర్ ఇది…!

తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడుగా కె.వి రెడ్డిది ప్రత్యేకమైన స్థానం. తన ముప్పై ఏళ్ళ సినిమా కెరియర్ లో 14 సినిమాలను ఆయన తెర‌కెక్కించారు. ఇంకా చెప్పాలంటే నటరత్న ఎన్టీఆర్‌కు కె.వి.రెడ్డి గురువు.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి చెందిన ఆయన చిన్నప్పుడు మేనమామల దగ్గర పెరిగారు. ఆ తర్వాత సినిమా రంగంపై ఆసక్తితో చెన్నై వచ్చారు. ఎన్టీఆర్ హీరోగా కె.వి.రెడ్డి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు.

సత్యహరిశ్చంద్ర – జగదేకవీరుని కథ – శ్రీకృష్ణ సత్య – మాయాబజార్ – పాతాళ భైరవి – శ్రీకృష్ణార్జునయుద్ధం ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అయితే చాలామంది ఎన్టీఆర్ – కె.వి.రెడ్డి మధ్య బంధాన్ని అపహస్యం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ తరంలో చాలామంది కె.వి.రెడ్డి – ఎన్టీఆర్ బంధాన్ని కులకోణంలో చూస్తూ సెటైర్లు వేస్తూ ఉంటారు.

ఎన్టీఆర్ తన గురువును పట్టించుకోలేదని.. అలాగే సినిమా రంగంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆయన ఆదుకోరని అవాకులు చవాకులు పేలుస్తూ ఉంటారు. అవన్నీ అవాస్తవాలు. కె.వి.రెడ్డి తన సొంత బ్యానర్ లో భాగ్యచక్రం – సత్యహరిశ్చంద్ర లాంటి సినిమాలు చేశారు. అవి ప్లాప్ అవడంతో పాటు ఆర్థికంగా కూడా ఆయనను దెబ్బ కొట్టాయి. దీంతో ఆయన తన కొడుకుని అమెరికాకు కూడా పంపించలేని స్థితికి దిగజారిపోయారు.

ఈ రెండు సినిమాలు ప్లాప్ అవడంతో విజయ – వాహనీ సంస్థలు ఆయన దూరం పెట్టేశాయి. ఆయనకి నెలవారి చెల్లించాల్సిన జీతం కూడా ఆపేసాయి. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కొంత డబ్బు ఇచ్చారు. అయితే తాను ఉచితంగా ఈ డబ్బు తీసుకోన‌ని… తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని కెవి.రెడ్డి కండిషన్ పెట్టారు. అలా వచ్చిన సినిమాయే శ్రీకృష్ణ సత్య.

ఎన్టీఆర్ సొంత బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమ రావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కొన్ని పాటలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుని చరిత్రలో నిలిచిపోయాయి. ఇక ఈ సినిమా కె.వి రెడ్డితో పాటు ఆయన ఆస్థాన రచయితగా పనిచేసిన పింగళికి కూడా చివరి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అలా ఎన్టీఆర్ తన గురుదక్షిణ చెల్లించుకున్నారు.. ఆయన కష్టాల్లో ఉంటే ఆదుకున్నారు. అయితే ఇవేవీ తెలియని చాలామంది ఎన్టీఆర్ తన గురువును ఆదుకోలేదని.. వారిద్దరు బంధాన్ని అపహస్యం చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news