Movies"చచ్చినా ఆ రోజు ని నా లైఫ్ లో మర్చిపోలేను..నరకం చూపించారు"..నాని...

“చచ్చినా ఆ రోజు ని నా లైఫ్ లో మర్చిపోలేను..నరకం చూపించారు”..నాని సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని ..ప్రెసెంట్ చేస్తున్న సినిమా దసరా . గత కొంతకాలంగా ఆయన చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . నాని త్వరలోనే దసరా అనే సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లోనే దసరా సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుంది.

టోటల్ గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు కథ నేపధ్యంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు నాని . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాని ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు . ఈ సినిమాలోని సీన్లు చేస్తున్నప్పుడు ఆయన ఊపిరి ఆగి పోయినంత పని అయిందని.. నరకం చూసానని చెప్పుకొచ్చాడు. ” ఈ సినిమాలోని ఓ సీన్ లో డంపర్ ట్రక్ కోల్స్ ను తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. ఆ డంపర్ ట్రక్ లో నుంచి నేను కిందపడితే నాపై ఆ బొగ్గు పడాలి ఇదే అసలు సీన్. అయితే ఈ సిన్ కోసం సింథటిక్ బొగ్గును రెడీ చేశారు.. అవి కూడా డస్ట్ తోనే నిండి ఉంటాయి.అయితే ఈ సీన్ కోసం రెడీ చేసుకున్న అనుకున్నట్టుగానే ఆ డంపర్ నుంచి నేను కింద పడ్డ”.

“అయితే సింథటిక్ కోర్స్ కింద నుంచి నేను పైకి రావడానికి కొంత టైం పడుతుంది ..నేను ఊపిరి పీల్చుకోకూడదు ఆ గ్యాప్ లో నేను పీల్చుకుంటే డస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది.. దీంతో నరకం చూసాను షూటింగ్ పూర్తి అయ్యాక దాదాపు రెండు నెలలు ఇబ్బంది పడ్డ.. నేను చాలా టార్చర్ ఫేస్ చేశాను.. ఆ ఇబ్బంది నుంచి బయట పడడానికి నాకు చాలా రోజులే పట్టింది. దాదాపు రెండు నెలలకు పైగా నేను నిద్రలేని రాత్రులు గడిపాను “అంటూ నాని చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే నాని హిట్ కోసం ఈ రేంజ్ లో కష్టపడ్డాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news