Moviesఎన్టీఆర్ - కొర‌టాల అప్పుడే లీకులు… ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది..!

ఎన్టీఆర్ – కొర‌టాల అప్పుడే లీకులు… ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. వచ్చేయేడాది ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఎన్టీఆర్ కు జోడిగా దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక గత రాత్రి ఈ సినిమా షూటింగ్ జరిగింది. తారక్ పై కొన్ని మాంటేజ్ షార్ట్స్ తీశారు.

సినిమా షూటింగ్ అలా ప్రారంభమైందో లేదో.. వెంటనే కొన్ని స్టిల్స్ బయటకు వచ్చేయటం.. ఆ స్టిల్స్ చూసిన వారు ఎవరికివారు ఈ సినిమా కథ ఎలా ఉంటుందో ? అని ఊహించేసుకోవడం కూడా ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైన విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బయటపెట్టారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌తో కలిసి దిగిన ఫోటోలను రత్నవేలు షేర్ చేశారు.

ఈ ఫోటోలో బ్యాగ్రౌండ్ లో ఓ భారీ బోటు సెట్ కనిపిస్తోంది. కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమా సముద్రం నేపథ్యంలో ఉంటుందని లీక్ ఇచ్చారు. కొరటాల మెయిన్ లైన్ ఎలా ? ఉండబోతుందో చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు రత్నవేలు స్టిల్ కూడా లీక్ చేయడంతో కథపై రకరకాల ఊహాగానాలు అయితే మొదలైపోయాయి. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు కంపోజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరిర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇప్పటికే వచ్చే ఏడాది ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక నటీనటులతో పాటు షూటింగ్ అప్డేట్స్, టైటిల్ కూడా కొరటాల ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news