Moviesఈ ఫోటో లో చిరు-పవన్ తో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా..?...

ఈ ఫోటో లో చిరు-పవన్ తో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా..? మెగా ఫ్యామిలీకి గుండకాయ లాంటి మనిషి..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక గత గతం తాలూకా ఫొటోస్ ఎన్నో వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రెసెంట్ సోషల్ మీడియాలో మీరు ఇక్కడ పైన చూస్తున్న ఫోటో తెగ చక్కెర్లు కొడుతుంది . ఈ ఫోటోలో మనకి కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులు మనకు బాగా తెలిసిన వాళ్ళు . మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ఇండస్ట్రీ ని సింగిల్ హ్యాండ్ తో ఇప్పటికీ ఏలేస్తున్నాడు . మరొకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఓవైపు సినిమా ఇండస్ట్రీని మరోవైపు రాజకీయాలను సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ స్టార్ గా ముందుకు దూసుకెళ్తున్నాడు .

అయితే ఇక్కడ చిరంజీవి , పవన్ కళ్యాణ్ తో ముచ్చటిస్తున్న మూడో వ్యక్తి ఎవరో అంటూ అందరూ బుర్ర పిక్కుంటున్నారు . అయితే ఈ వ్యక్తి ఎవరో కాదు ఇక్కడ చిరంజీవి – పవన్ కళ్యాణ్ తో ముచట్టిస్తున్న వ్యక్తి పేరు జి సత్యమూర్తి. ఎవరు అబ్బా ఈయన అంటూ అనుకుంటున్నారా ..? ఈయన ఎవరో కాదండి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్న దేవిశ్రీప్రసాద్ తండ్రి జి సత్యమూర్తి.

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న జన్మించిన ఈయన రాఘవేంద్రరావు డైరెక్షన్లో దేవత సినిమా ద్వారా రైటర్ గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు . కేవలం ఈ ఒక్క సినిమానే కాదు ఆ తర్వాత ఎంతోమంది స్టార్స్ సినిమాలకు రైటర్ గా వ్యవహరించారు . వాలల్లో మరీ ముఖ్యంగా చిరంజీవి – బాలకృష్ణ సినిమాలకు ఎన్నో కథలను అందించాడు . చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786, అభిలాష , ఛాలెంజ్ వంటి విజయవంతమైన చిత్రాలకు కధలు అందించింది జి సత్యమూర్తి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

కాగా చిరంజీవి ఫ్యామిలీ లో ఏ ఫంక్షన్ అయినా సరే తప్పకుండా హాజరవుతూ ఉంటారు అని అప్పట్లోనే వార్తలు వినిపించేవి. అందుకే మెగాస్టార్ చిరంజీవి సైతం దేవి శ్రీ ప్రసాద్ కి తన సినిమాలో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీంతో జి సత్యమూర్తి పేరు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news