Moviesసీన్ రివ‌ర్స్‌: హీరోని బలవంతం చేసిన లేడీ డైరెక్ట‌ర్..అలా చేయమంటూ ...

సీన్ రివ‌ర్స్‌: హీరోని బలవంతం చేసిన లేడీ డైరెక్ట‌ర్..అలా చేయమంటూ టార్చర్..!!

సినిమా రంగంలో మహిళా నటీమణులు ఎదుర్కొనే వేధింపుల గురించి అందరికీ తెలిసిందే. మహిళలు లైంగిక వేధింపులకు గురికావడం అనేది ఇప్పటినుంచే కాదు.. సినిమా రంగంలో కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. గతంలో పరస్పర అంగీకారంతో ఇవి ఎక్కువగా జరగటంతో పెద్దగా బయటకు వచ్చేవి కావు. అయితే అప్పుడు ఇప్పుడు ఉన్నంత మీడియా కూడా లేదు. ఇప్పుడు తరం మారిపోయింది. మహిళా నటి మణుల్లో ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా ఓపెన్ అయిపోతున్నారు. గత ఆరేడు సంవత్సరాలుగా కాస్టింగ్ కౌచ్ పై లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు, లేడీ ఆర్టిస్టులు ఎలా గళం ఎత్తుతున్నారో చూస్తూనే ఉన్నాం.

అయితే అందుకు భిన్నమైన సంఘటన సౌత్ సినిమా ఇండస్ట్రీలో జరగటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ నటుడిని మహిళ దర్శకురాలు తీవ్రమైన వేధింపులకు గురిచేసి జైలు పాలైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మల్లువుడ్ సినీ పరిశ్రమకు చెందిన లక్ష్మీ దీప అనే లేడీ డైరెక్టర్ ఇప్పుడిప్పుడే అక్కడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతుంది. ఇప్పటికే ఆమె పలు సినిమాలకు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నారు.

ఈ క్రమంలోనే ఆమె గత ఏడాది ఓ వెబ్ సీరిస్‌ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో నటించిన మెయిన్ హీరో ఆమెపై ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్ విచారించిన కోర్టు మహిళా దర్శకురాలు లక్ష్మీదీప‌ను అరెస్టు చేయాలని కేర‌ళ‌ పోలీసులను ఆదేశించింది. దీంతో రెండు రోజుల్లో క్రితం కేరళ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.

ఈ క్రమంలోనే సదరు న‌టుడు ఆ మహిళా దర్శకురాలు లక్ష్మీదీప‌ తనను ఎలా ? వేధింపులకు గురిచేసిందో వివరించారు. ఆమె గత ఏడాది ఓ వెబ్ సిరీస్ కోసం తనను సంప్రదించిందని.. తనను హీరోగా చేస్తానని చెప్పింది. ఆ వెబ్ సిరీస్ లో నటించేందుకు నాతో ఒప్పందం కుదుర్చుకుంది… కొన్ని సీన్లు షూట్ చేసిన తర్వాత అభ్యంతరకరమైన సీన్ల‌లో కూడా నటించాలని తనపై ఒత్తిడి చేసిందని.. దానికి నేను ఒప్పుకోకపోయినా బలవంతం చేయడంతో పాటు కాంట్రాక్టు పేరుతో భయపెట్టి ఆ పాడుసేనులలో నటించేలా చేసిందని తెలిపాడు.

ఈ సంఘటన గత ఏడాది అరువిక్కుర‌లోని ఓ ప్లాట్లో చోటు చేసుకుందని సదరు న‌టుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొదట పోలీసులకు ఫిర్యాదు చేయగా మహిళా దర్శకురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పాడు. అయితే ఈ విషయం ఇప్పుడు కేవలం మలయాళ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా… సౌత్ సినీ ఇండస్ట్రీలో పెద్ద హాట్‌ టాపిక్ గా మారింది. ఓ మహిళ దర్శకరాలు తనను వేధించిందని ఓ నటుడు కోర్టుమెట్లు ఎక్కటం సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news