Moviesటాలీవుడ్‌లో ఇదే బిగ్ హాట్ టాపిక్... ఆ హీరోయిన్‌తో కేర‌వాన్‌లోనే కానిచ్చేస్తోన్న...

టాలీవుడ్‌లో ఇదే బిగ్ హాట్ టాపిక్… ఆ హీరోయిన్‌తో కేర‌వాన్‌లోనే కానిచ్చేస్తోన్న స్టార్ హీరో… !

సినిమా ఇండస్ట్రీలో హీరోలు.. హీరోయిన్ల మధ్య సాన్నిహిత్యాలు, స్నేహాలు, ప్రేమలు, డేటింగ్ లు… అవసరాల కోసం ఒకరి కోరికలు మరొకరు తీర్చటాలు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏ హీరో అయినా ప్రస్తుతం తనతో షూటింగ్లో ఉన్న హీరోయిన్ విషయంలో చాలా క్లోజ్ గా అవుతున్నాడని.. ఆమెతో అతడి స్నేహం ఎక్కడికో వెళ్లిపోయిందన్న గుసగుసలు రావడం కామన్.

తాజాగా ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ నడుస్తోంది. ఇందులో నటిస్తున్న హీరోయిన్ తో ఇప్పుడు ఆయన వ్యవహారం శృతిమించుతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయ్యగారికి ఆ హీరోయిన్ అంటే మక్కువ కలిగింది. దీంతో ఆ హీరోయిన్ ఎప్పుడు ప‌డితే అప్పుడు ఆయన చెంత చేరిపోతుందట. ఇప్పుడు సదరు హీరోగారి కేర‌వాన్ దిగటం లేదట. వీరిద్దరూ కేర‌వాన్ లోకి వెళ్లి గంటల తరబడి డిస్కషన్లు పెట్టుకుని బయటకు వస్తున్నారట.

లోపల ఏం జరుగుతుందో ? బయట ఉన్న వాళ్లకు ఎవరికీ అర్థం కావడం లేదట. అసలే ఆయన పెద్ద హీరో.. అమ్మాయిలు విషయంలో కాస్త వీక్నెస్ అన్నది అందరికీ తెలిసిందే. ఇలాంటి టైంలో తనతో కలిసి నటిస్తున్న ఆ హీరోయిన్ పై ఆ హీరో గారి కన్ను పడిందన్న టాక్ ఉంది. వెంటనే స్నేహం కలిపేశాడు.. ఇప్పుడు జతకుదిరిపోయిందన్న గుసగుసలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ ఏకంగానే ముచ్చట్లతో పాటు అన్ని పెట్టేసుకుంటున్నారట.

వాళ్ళిద్దరూ ఎలా ? చేసుకున్నా ఎవ్వ‌రికి ఇబ్బందే లేదు. అది వాళ్ళ ఇష్టం. అయితే ఇప్పుడు ఆ సినిమా దర్శకుడుకి అసలు తలనొప్పి మొదలైందట. షాట్‌ రెడీ అని అంటే వెంటనే షాట్ కు రావడం లేదట. కనీసం దర్శకుడు ఆర్డర్ జారీ చేసినా అది కూడా లైట్ తీసుకుంటుందట. అసలే ఆయన స్టార్ డైరెక్టర్. మంచి పేరు ఉన్న డైరెక్టర్. అయితే ఆ హీరోయిన్‌ను ఏమీ అనే పరిస్థితి లేదు.

హీరోయిన్ కు వెనక ఉన్న హీరోని చూసి ఆ డైరెక్టర్ తలబాదుకుంటున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా ఆ స్టార్ హీరోతో సూపర్ హిట్ కొట్టాలని కసితో సినిమా స్టార్ట్ చేసిన ఆ డైరెక్టర్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలుక మాదిరిగా మారిందట. ఏదో సర్దుకుపోయి ముందు ఈ సినిమా కంప్లీట్ చేసి అవతలపడేస్తే చాలు అనుకునే స్థితికి వచ్చేసాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news