MoviesTrivikram-Mahesh Babu త్రివిక్ర‌మ్ ఇష్టారాజ్యం…. ర‌గిలిపోతోన్న మ‌హేష్‌బాబు…!

Trivikram-Mahesh Babu త్రివిక్ర‌మ్ ఇష్టారాజ్యం…. ర‌గిలిపోతోన్న మ‌హేష్‌బాబు…!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు – ఖలేజా సినిమాలు వచ్చాయి. కమర్షియల్ గా ఈ సినిమాలు ఎలాంటి ? విజయం సాధించాయి అన్నది పక్కన పెడితే ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే ఈ రెండు సినిమాలను ఆసక్తితో చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. అతడు – ఖలేజా వచ్చి 15 ఏళ్లు అవుతున్నా బుల్లితెరపై ఇప్పటికీ అదిరిపోయే టీఆర్పి రేటింగులు సాధిస్తూ ఉంటాయి.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఇటు మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 12 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవుతాయి అన్న అంచనాలు ఉన్నాయి. దురదృష్టం ఏంటో గాని మహేష్ కుటుంబంలో వరుసగా ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరుగుతూ ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.

ఇక షూటింగ్ ఇప్పుడు కాస్త స్పీడ్ అవుతుంది.. అనుకుంటున్న టైంలో మహేష్ బాబు త్రివిక్రమ్ మీద ఆగ్రహంగా ఉన్నాడన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. త్రివిక్ర‌మ్ ఇప్పుడు డైరెక్ష‌న్ కంటే కూడా తాను నిర్మిస్తోన్న లేదా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించే సినిమాల మీదే ఎక్కువుగా ఫోక‌స్ పెట్టాడ‌నే అంటున్నారు. భీమ్లానాయ‌క్ సినిమా తెర‌వెన‌క అంతా తానై ఉన్నాడు త్రివిక్ర‌మ్‌.

ఈ సినిమా డైరెక్ష‌న్ చేయ‌క‌పోయినా త్రివిక్ర‌మ్‌కు ఏకంగా రు. 10 కోట్లు ముట్టాయంటున్నారు. ఇప్పుడు వినోద‌య సితం రీమేక్‌కు కూడా త్రివిక్ర‌మ్ అంతా తానై చేస్తున్నాడు. ఇందుకు కూడా భారీగానే ముడుతోంద‌ట‌. అలాగే ప‌వ‌న్ – సుజీత్ ఓజీ మూవీ వెన‌క కూడా త్రివిక్ర‌మ్ ప్లానింగే ఉంది. ఇలా ప‌వ‌న్ సినిమాలకు అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తోన్న త్రివిక్ర‌మ్.. మ‌హేష్ మూవీ విష‌యంలో నిర్ల‌క్ష్యంతో ఉంటున్నాడ‌న్న‌దే మ‌హేష్ భావ‌న‌గా తెలుస్తోంది.

ఇలా చేయ‌డం ఏ మాత్రం బాగోలేదని కూడా మ‌హేష్‌.. త్రివిక్ర‌మ్ ముందు ఓపెన్ అయిపోయాడ‌నే తెలుస్తోంది. మ‌రి త్రివిక్ర‌మ్ ఇప్ప‌ట‌కీ అయినా మ‌హేష్ సినిమా మీద కాన్‌సంట్రేష‌న్ చేస్తేనే ఈ సినిమా అనుకున్న అంచ‌నాలు అందుకుంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news