MoviesAndrea Jeremiah ఆ ఇద్ద‌రితో రెండుసార్లు ప్రేమ‌లో మోస‌పోయాను.. కాక రేపుతోన్న...

Andrea Jeremiah ఆ ఇద్ద‌రితో రెండుసార్లు ప్రేమ‌లో మోస‌పోయాను.. కాక రేపుతోన్న ఆండ్రియా కామెంట్స్‌…!

కోలీవుడ్‌లో సంచ‌ల‌నం రేపే అమ్మాయిల్లో ఆండ్రియా ఒక‌రు. ఆండ్రియా బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. ఆమెకు మ్యూజిక్‌లో టాలెంట్ ఉంది. మాంచి సింగ‌ర్‌. ఆమె పాట పాడితే టాప్ లేచిపోవాల్సిందే. ఇటు హీరోయిన్‌. ఆమె ఏ విష‌యంలో అయినా ఓపెన్‌గా మాట్లాడితే కావాల్సినంత బోల్డ్‌నెస్‌తో పాటు ర‌చ్చ కూడా మామూలుగా ఉండ‌దు. చిన్న వ‌య‌స్సులోనే మంచి పేరు తెచ్చుకున్నా ఆమె ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఎందుకో స్టార్ కాలేక‌పోయింది.

ఇందుకు ఆమె కొంద‌రిని గుడ్డిగా న‌మ్మేసి స‌ర్వ‌స్వం అర్పించేసుకుని ప్రేమ‌లో మోస‌పోవ‌డ‌మే..! అయితే ఈ విష‌యం ఆమెకు త‌ర్వాత అర్థ‌మైంది. ఆమె తొలి సినిమా హీరోయే స్టార్ శ‌ర‌త్‌కుమార్‌. శ‌ర‌త్‌కుమార్ హీరోగా చేసిన ముత్తుచ్చారం సినిమాతో హీరోయిన్గా ప‌రిచ‌యం అయిన ఆండ్రీయా ఆ త‌ర్వాత ధ‌నుష్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, కార్తీ, ఉద‌య‌నిధి స్టాలిన్ లాంటి హీరోల ప‌క్క‌న న‌టించి మంచి పేరు తెచ్చుకుంది.

పైగా ఆండ్రియా మాంచి యాక్ష‌న్ హీరోయిన్ కూడా. ఆమె ఫైట్ల‌లో అద‌ర‌గొట్టేస్తుంది. అయితే ఆమె సుచీలీక్స్ వ్య‌వ‌హారంలో ఇండియా వైజ్‌గా పాపుల‌ర్ అయ్యింది. త‌న‌కంటే వ‌య‌స్సులో చిన్నోడు అయిన కోలీవుడ్ పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌తో రాస‌లీల‌లు చేసింద‌న్న వార్త‌లు రావ‌డంతో ఆమె పేరు మార్మోగింది. ఆ త‌ర్వాత త‌న‌కంటే వ‌య‌స్సులో చిన్నోడు అన్న కార‌ణంగానే అనిరుధ్‌కు దూర‌మైన‌ట్టు ఆమే స్వ‌యంగా చెప్పారు.

ఆ త‌ర్వాత ఆండ్రియా కెరీర్‌లోనే బిగ్ రాంగ్ స్టెప్ వేసింది. ఓ వివాహితుడితో రిలేష‌న్‌షిప్ మెయింటైన్ చేస్తూ రెండేళ్ల పాటు అత‌డితోనే స‌హ‌జీవ‌నం చేసింది. అత‌డు పెట్టిన టార్చ‌ర్‌తో ఆండ్రియా మాన‌సికంగా కూడా కుంగిపోయిన ఆండ్రియా ఆ త‌ర్వాత ఆయుర్వేద చికిత్స‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌ని స్వ‌యంగా చెప్పింది. ఆ వివాహిత వ్య‌క్తిని తాను ప్రేమించ‌డం త‌న కెరీర్‌లో వేసిన పెద్ద రాంగ్ స్టెప్ అని కూడా చెప్పింది.

ఇక ఆండ్రియా ధ‌నుష్‌తో కూడా ప్రేమాయ‌ణం న‌డిపింద‌న్న టాక్ ఉంది. త‌న గ‌త బాధ‌లు అన్నీ గుర్తు చేసుకున్న ఆమె రీసెంట్‌గా ప్రేమికుల రోజు దినోత్స‌వం సంద‌ర్భంగా తాను గ‌తంలో ఇద్ద‌రి చేతుల్లో మోస‌పోయాను.. ఇది నాకు బ్లాక్ డే అని ఎమోష‌న‌ల్ అయ్యింది. పైగా బ్లాక్ ష‌ర్ట్ ధ‌రించి మ‌రీ ఆండ్రియా ఈ కామెంట్ చేయ‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news