Moviesద‌గ్గుబాటి అభిరాంపై శ్రీ రెడ్డి ప‌గ ఏ రేంజ్‌లో అంటే...!

ద‌గ్గుబాటి అభిరాంపై శ్రీ రెడ్డి ప‌గ ఏ రేంజ్‌లో అంటే…!

టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడో త‌రంలోనూ రానా హీరోగా వచ్చారు. లెజెండ్రీ నిర్మాత రామానాయుడు వేసిన బీజం.. ఆ త‌ర్వాత ఆయ‌న వార‌సులు సురేష్‌బాబు అగ్ర నిర్మాత‌గా, వెంక‌టేష్ హీరోగా ఎదిగారు. ఇప్పుడు మూడో త‌రంలో సురేష్‌బాబు త‌న‌యుడు రానా హీరోగా ఎంట్రీ ఇచ్చి తానేంటో నేష‌న‌ల్ వైడ్‌గా ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు రానా త‌మ్ముడు అభిరాం కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో అభిరాం హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న అహింస సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఇదిలా ఉంటే అభిరాం సినిమాల్లోకి రాక‌ముందే అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌గా మారిన శ్రీరెడ్డి అభిరాంపై అనేకానేక ఆరోప‌ణ‌లు చేసింది. అభిరాం త‌న‌ను చాలాసార్లు లైంగీకంగా వాడుకున్నాడ‌ని.. నాన‌క్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలోనే త‌మ ఇద్ద‌రి శోభ‌నం జ‌రిగింద‌ని… సినిమా ఛాన్సుల పేరుతో త‌న‌ను అభిరాం స‌ర్వ‌స్వం దోచుకున్నాడ‌ని చెప్ప‌డంతో పాటు సురేష్‌బాబు కుటుంబాన్ని బ‌జారుకు ఈడ్చేసింది.

ఇలా అభిరాం సినిమా హీరో కాక‌ముందే వివాదాల‌తో వార్త‌ల్లో ఉండాల్సి వ‌చ్చింది. అక్క‌డితో ఆగ‌ని శ్రీరెడ్డి వెంకీ మామా, సురేష్ మామ అంటూ మ‌రింత రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతూ వ‌స్తోంది. అహింస ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయిన‌ప్పుడు కూడా ఆ సినిమా ప్లాప్ అవుతుందంటూ ఫైర్ అయ్యింది. ఇక ఇప్పుడు త్వ‌ర‌లోనే అహింస‌ను రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు.

ఫిబ్ర‌వ‌రిలో సోలో డేట్ చూసి సినిమాను రిలీజ్ చేయాల‌ని సురేష్‌బాబు అనుకుంటున్నార‌ట‌. అయితే ఇటు శ్రీరెడ్డి కూడా ఈ సినిమాను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోవ‌డంతో పాటు శాప‌నార్థాలు పెట్టేందుకు రెడీ అవుతోంది. సోష‌ల్ మీడియాలో ఈ సినిమాను ఆమె ఓ ఆటాడుకోవాల‌ని క‌సితో ర‌గులుతోంద‌ట‌. ఇక ఈ సినిమాకు అనుకున్నంత బ‌జ్ రాక‌పోవ‌డంతో రిలీజ్ డేట్‌, ప్ర‌మోష‌న్లు అన్నీ రానా చేతుల మీదుగా చేయాల‌ని సురేష్‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక ద‌గ్గుబాటి కుటుంబాన్ని వ‌ద‌ల‌నీ శ్రీరెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు రానా సినిమాల‌పై అంత‌గా టార్గెట్ చేయ‌లేదు. అయితే అభిరాం అహింస‌ను మాత్రం ఓ ఆటాడుకునే వ‌ర‌కు వ‌దిలేలా లేద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ నెగ‌టివిటి నుంచి అభిరాం ఎలా బ‌య‌ట ప‌డ‌తాడు ? తొలి సినిమా గండం ఎలా ? గ‌ట్టెక్కుతాడు ? అనేది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news