Moviesఏఎన్నార్‌... త‌న భార్య అంజ‌లీపై రూమ‌ర్ తెలిసిన భ‌ర్త ఆదినారాయ‌ణ ఏం...

ఏఎన్నార్‌… త‌న భార్య అంజ‌లీపై రూమ‌ర్ తెలిసిన భ‌ర్త ఆదినారాయ‌ణ ఏం చేశారంటే..!

అంజ‌లీదేవి-అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జోడీ తెలుగు తెర‌పై రికార్డులు సృష్టించింది. అనేక సినిమాల్లో ఇద్ద‌రూ క‌లిసి చేసిన న‌ట‌న‌కు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఫిదా అయింది. ముఖ్యంగా అనార్క‌లి వంటి ప్రేమ క‌ధా చిత్రం.. ఇరువురిని రూమ‌ర్స్ వైపు కూడా న‌డిపించింద‌న‌డంలో సందేహం లేదు. అనేక చిత్రాల్లో క‌థ‌ను బ‌ట్టి.. హీరో, హీరోయిన్లుగానే కాకుండా.. త‌ల్లి కొడుకులుగా కూడా న‌టించారు.

అయితే.. సినీ సీమ‌లో మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో ఇద్ద‌రిపైనా రూమ‌ర్స్ రాజ్య‌మేలాయి. అప్ప‌ట్లో ఇప్ప‌టి మాదిరిగా రోజూ వ‌చ్చే ప‌త్రిక‌లు.. అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసే మాధ్య‌మాలు లేవు. ఏది నిజ‌మో.. ఏది అబ‌ద్ధ‌మో కూడా..తెలిసేది కాదు. మ‌రీ ముఖ్యంగా సినీమాల‌కు సంబంధించి అప్ప‌ట్లో ప‌దిహేను రోజుల‌కు ఒక‌సారి ప‌క్ష‌ప‌త్రిక‌లు వ‌చ్చేవి. మ‌ద్రాస్ కేంద్రంగా కాగ‌డా లాంటి ప‌త్రిక‌లు సినిమా వాళ్ల ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, రూమ‌ర్లు రాసే విష‌యంలో హైలెట్ అయ్యేవి.

వాటిలో వ‌చ్చే వార్త‌ల‌నే అభిమానులు నిజం అనుకునేవారు. దీంతో గ్యాపిస్ రాయుళ్లు రెచ్చిపోయేవారు. ఇలా.. ఒక సారి అంజ‌లీదేవి – ఏఎన్నార్‌ల‌కు సంబంధించి అప్ప‌టి ఓల్డ్ జ్యోతిచిత్ర ప‌త్రిక‌లో ఒక గ్యాసిప్ రాశారు. బొంబాయిలో షూటింగ్ కోసం వెళ్లిన అంజ‌లీదేవి, ఏఎన్నార్‌ల‌కు ఒకే సూట్ బుక్ చేశార‌ని.. రెండు రోజులైనా కూడా వారు ఆ సూట్‌నుంచి బ‌య‌ట‌కు రాలేద‌ని.. ఈ గ్యాసిప్ సారాంశం.

అయితే.. ఈ విష‌యం తెలియ‌ని.. అక్కినేని, అంజ‌లీదేవి.. మామూలుగానే చెన్నై చేరుకున్నారు. ఇక‌, అప్ప‌టికే వివాహ‌మైన అంజలీదేవి.. భ‌ర్త ఆదినారాయ‌ణ‌రావుకు ఈ గ్యాసిప్ తెలిసింది. దీంతో స‌ద‌రు వార్త రాసిన‌.. లేఖ‌రి.. ఏం జ‌రుగుతుందా? అని ఎదురు చూస్తున్నాట్ట‌! కానీ, ఈ ముగ్గురూ క‌లిసి.. కాఫీ తాగుతూ క‌నిపించార‌ట‌. దీంతో స‌ద‌రు విలేఖ‌రి ఉండ‌బ‌ట్ట‌లేక‌.. గ్యాసిప్ గురించి ప్ర‌స్తావించేస‌రికి.. `ఆ.. ఇవ్వ‌న్నీ కామ‌నేన‌య్యా..“ అని తోసిపుచ్చార‌ట ఆదినారాయ‌ణ‌రావు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news