Moviesతెలుగు స్టార్ హీరో పై సుధీర్ బాబు సెన్సేషనల్ కామెంట్స్..అంత మాట...

తెలుగు స్టార్ హీరో పై సుధీర్ బాబు సెన్సేషనల్ కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఘట్టమనేని ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి అడుగుపెట్టిన మరో హీరోగా సుధీర్ బాబు పేరు సంపాదించుకున్నాడు . అంతేకాదు అందరి హీరోలు పాన్ ఇండియా లెవెల్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కోసం ట్రై చేస్తుంటే .. సుధీర్ బాబు మాత్రం కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ..మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకోవాలని తాపత్రయ పడుతున్నారు . ఇప్పటివరకు సుధీర్ బాబు చేసే సినిమాలు అన్ని చూసినట్లయితే ప్రతి సినిమాలోనూ హీరోగా తనదైన స్టైల్ లో నటించి సినిమా సినిమాకి క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపిస్తూ వచ్చాడు .

సినిమా ఫ్లాప్ అయినా సరే నటన పరంగా సుధీర్ బాబు సక్సెస్ అయ్యాడు . కాగా రీసెంట్గా ఆయన నటిస్తున్న సినిమా “హంట్” భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ .. స్టార్ తెలుగు స్టార్ హీరోస్ పై సంచలన కామెంట్స్ చేశారు .

“నేను నా సినిమాలో ఎక్కువగా యాక్షన్ సీన్స్ చేయడానికి ఇష్టపడతాను. కానీ నాకు ఎమోషనల్ కంటెంట్ అంటే చాలా ఎక్కువ ఇష్టం . నేను ఆరోగ్యంగా ఉండడానికి జిమ్ చేస్తాను. అంతే తప్పిస్తే అమ్మాయిల ముందు అందరికీ చూపించడానికి సిక్స్ ప్యాక్స్ చేయను . నిజానికి అందరి ముందు నాకు షార్ట్ తీయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది “అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో ఎప్పుడూ తన సినిమాలో షార్ట్ లేకుండా కనిపించి అమ్మాయిలు ముందు ఫోజ్ కొడుతూ తానే ఇండస్ట్రీకి నెంబర్ వన్ అంటూ హంగామా చేసే హీరోను పరోక్షకంగా టార్గెట్ చేస్తూ సుధీర్ బాబు కామెంట్స్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో జనాలు చెప్పుకొస్తున్నారు. దీనితో సోషల్ మీడియాలో సుధీర్ బాబు పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news