Moviesమిగతా హీరోయిన్లలో లేనిది..సాయి పల్లవి లో ఉన్నది ఇదే..మీరు గమనించారా ..!!

మిగతా హీరోయిన్లలో లేనిది..సాయి పల్లవి లో ఉన్నది ఇదే..మీరు గమనించారా ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే ..వాళ్లలో జనాలకి నచ్చిన బ్యూటీని మదిలో పెట్టుకుంటారు . ఆ బ్యూటీ సినిమాలు హిట్ కాకపోయినా సరే ఆ బ్యూటీని ఆ బ్యూటీ పేరునే జపిస్తూ ఉంటారు. ఆ లిస్ట్ లో ముందు ఉంటుంది సాయి పల్లవి . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . డాక్టర్ చదువుకున్న సాయి పల్లవి ఎవ్వరూ ఊహించిన విధంగా మలర్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

అయితే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ను వేయించుకొని ఇప్పుడు ఇండస్ట్రీలోని వన్ అఫ్ ది టాప్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది. నిజానికి సాయి పల్లవి నటించిన సినిమాలు హిట్ కొట్టింది చాలా తక్కువ . కానీ నటించిన ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

మిగతా హీరోయిన్లందరూ రెమ్యూనరేషన్ కోసం పాపులారిటీ కోసం సినిమాలు చేస్తుంటే .. సాయి పల్లవి మాత్రం తన సాటిస్ఫాక్షన్ కోసం నటనపై తనకున్న ఇంట్రెస్ట్ కారణంగానే సినిమాలు తీస్తుంది . ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది జనాలు ఓపెన్ గానే చెప్పుకొచ్చారు . సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయడం.. సాయి పల్లవి లోని గొప్పగుణం . అదే మిగతా హీరోయిన్లు కాల్ షీట్స్ బుక్ చేసుకునే ముందే రెమ్యూనరేషన్ పక్కాగా డిమాండ్ చేసి తీసుకుంటారు. డబ్బు కోసమే సినిమాలు చేసే హీరోయిన్స్ ఉన్న మన ఇండస్ట్రీలో డబ్బుని అసలు కేర్ చేయని సాయి పల్లవి ఉండడం ఇండస్ట్రీకే గర్వకారణం అంటున్నారు సాయి పల్లవి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news