Moviesకత్తి లాంటి ఫిగర్ పట్టిన కొడుకు.. షారుఖ్ ఇంటి కోడలు కాబోతున్న...

కత్తి లాంటి ఫిగర్ పట్టిన కొడుకు.. షారుఖ్ ఇంటి కోడలు కాబోతున్న స్టార్ హీరోయిన్..!?

వావ్.. ఆర్యన్ ఖాన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా అంటే నో అని చెప్పాలి . కానీ డేటింగ్ మాత్రం చేస్తున్నాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . గత కొన్ని నెలలుగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ పేరు మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. స్టార్ సన్ గా పుట్టి పెరిగి లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్న అర్యన్ ఖాన్.. మితిమీరిన స్వేచ్ఛతో తప్పుడు పనులు చేస్తున్నారు అంటూ కొందరు ఫాన్స్ మండిపడుతున్నాడు.

రీసెంట్ గానే డ్రగ్స్ విషయంలో ఆర్యన్ ఎంతవరకు వెళ్ళాడో అందరికీ తెలిసిందే . అంతే కాదు జైల్లో చిప్పకూడు కూడా తినేసి వచ్చాడు. కాగా ఇండస్ట్రీలోకి హీరోగా అరంగేట్రం చేయకుండానే షారుఖ్ ఖాన్ కొడుకు ఈ రేంజ్ లో మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తుండడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. కాగా రీసెంట్ గా షారుక్ కుమారుడు గురించిన ఇంట్రెస్టింగ్ మేటర్ బాలీవుడ్లో వైరల్ అవుతుంది . సెక్సీ ఫిగర్ గా పేరు సంపాదించుకున్న నూరా ఫతేహీ తో అతడు డేటింగ్ చేస్తున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. అంతేకాదు నోరా ఫతేహి – ఆర్యన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లారని .. అక్కడే విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

వీళ్ళిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడంతో .. ఈ విషయం అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇదే విషయం షారుఖ్ ఖాన్ కి కూడా తెలుసు అని.. ఆమె కోడలుగా చేసుకోవడానికి రెడీగా ఉన్నాడంటూ బాలీవుడ్ మీడియా చెప్పకువస్తుంది . నూరా ఫతేహి వయసు 30.. ఆర్యన్ వయసు కేవలం 25 నే..వీళ్ల మధ్య ఐదేళ్ల తేడా ఉంది. ఇది బాలీవుడ్లో పెద్ద మ్యాటర్ కాదు. 10 – 15 ఏళ్ల గ్యాప్ ఉన్న వాళ్లు కూడా డేటింగ్ చేసుకుంటున్నారు . ఒకవేళ ఇదే నిజమైతే షారుక్ ఖాన్ ఇంటికి స్టార్ హీరోయిన్ కోడలుగా వెళ్లబోతుందన్నది మాత్రం వాస్తవం . చూడాలి మరి ఈ జంట డేటింగ్ తోనే ఆగిపోతారో.. ఆ డేటింగ్ కాస్త పెళ్లి పీటల వరకు తీసుకెళ్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news