Moviesఫైనల్లీ..సమంతతో నాగచైతన్య.. అక్కినేని అభిమానులకు అంతకన్నా హ్యాపీ న్యూస్ ఉంటుందా..?

ఫైనల్లీ..సమంతతో నాగచైతన్య.. అక్కినేని అభిమానులకు అంతకన్నా హ్యాపీ న్యూస్ ఉంటుందా..?

భార్యాభర్తలు అన్నాక గొడవలు , తగాదాలు , గిల్లిగజ్జాలు సర్వసాధారణం , భార్యాభర్తల బంధం లో అవి ఉంటేనే ఓ ముచ్చట సరదా ఉంటుంది . అయితే అవి విడాకులు తీసుకునే వరకు.. పెద్దలు మద్దిస్తాలు చేసే వరకు వెళ్లకూడదు. సరదాగా ఎక్కడ గొడవలు అక్కడే తెంపేసుకుని భార్యాభర్తల బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలి . ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటున్నారు. అదే లిస్టులోకి వచ్చారు నాగచైతన్య – సమంత . టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

గోవాలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి టైంలో ఎలాంటి హంగామా చేశారో మనందరికీ తెలుసు . కాగా పెళ్లయిన కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకొని దూరంగా బ్రతుకుతున్నారు . అయితే ఇప్పటికి నాగచైతన్య సమంతలకు వాళ్లపై ప్రేమ ఉందని జనాలు భావిస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా ఎయిర్ పోర్ట్ లో సమంత పిక్స్ చూసిన నాగచైతన్య చేసిన కామెంట్స్ ఏ అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే మయోసాటిస్ వ్యాధి కారణంగా బాధపడుతున్న సమంత రీసెంట్ గానే దక్షిణ కొరియాలో ట్రీట్మెంట్ తీసుకొని ఇండియాకి తిరిగి వచ్చింది .

శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన ఆరోగ్యం బాగో లేకపోయినా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది . ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ లో ఆమె విజువల్స్ చూసిన ఫ్యాన్స్ బాధపడిపోయారు. సమంత బక్క చిక్కిపోయి నిరసించిపోయి ..ముఖం లాగేసి చాలా దారుణంగా ఉంది అంటూ కామెంట్ చేశారు . అంతేకాదు సమంత పిక్స్ చూసిన నాగచైతన్య సైతం ఆమె హెల్త్ కండిషన్ పై ఆరా తీసినట్లు తెలుస్తుంది .

అంతేకాదు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య సమంత హెల్త్ బాగోలేని కారణంగా ఆమె పర్సనల్గా మీట్ అవ్వాలని ట్రై చేస్తున్నాడట . సమంత పిక్స్ చూసిన తర్వాత ఇంత దారుణంగా మారిపోయిందా.. సమంత హెల్త్ అంటూ బాధపడ్డాడట . అందుకే గొడవలు పట్టింపులు పక్కన పెట్టేసి ఓ ఫ్రెండ్ లా తన హెల్త్ గురించి కేర్ తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారట . ఒకవేళ నిజంగా ఇది నిజం అయితే మాత్రం అక్కినేని అభిమానులకు అంతకన్నా హ్యాపీ న్యూస్ మరొకటి ఉండదు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news