Moviesమా నాన్న సినిమాలు కన్నా ముందు..ఆ ఇద్దరి హీరోల మూవీలే చూస్తా.....

మా నాన్న సినిమాలు కన్నా ముందు..ఆ ఇద్దరి హీరోల మూవీలే చూస్తా.. చరణ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. మెగాస్టార్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చరణ్ ..చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు . పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సెకండ్ సినిమాకే ఇలాంటి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన మగధీర సినిమాలో అవకాశమందుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది .

కాగా రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న చరణ్..త్వరలోనే శంకర్ డైరెక్షన్ లోనో తెరకెక్కబోతున్న సినిమాతోనూ మంచి విజయాన్ని అందుకోబోతున్నాడు. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా హాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ..తన పర్సనల్ అండ్ సినిమాకి సంబంధించిన ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నాడు .

ఈ క్రమంలోనే చరణ్ మాట్లాడుతూ ..”నేను బ్రాట్ ఫిట్, టామ్ క్రూజ్లను స్ఫూర్తిగా తీసుకుంటానని.. ఈ ఇద్దరు సినిమాలు అస్సలు మిస్ అవ్వనని.. ఎన్నో ఏళ్లుగా చూస్తూనే వస్తున్నానని.. వయసుతోపాటు అభిమానులను పెంచుకుంటూ పోతున్నానని” చెప్పుకొచ్చాడు . అంతేకాదు తన నాన్న సినిమాల కన్నా ఎక్కువగా వీళ్ల సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి చూస్తానని చెప్పుకోరావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news