Movies‘స్పిరిట్’ కోసం మళ్ళీ ఆ కత్తిలాంటి ఫిగర్ తో రొమాన్స్ చేయబోతున్న...

‘స్పిరిట్’ కోసం మళ్ళీ ఆ కత్తిలాంటి ఫిగర్ తో రొమాన్స్ చేయబోతున్న ప్రభాస్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. !?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఈశ్వర్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ రెబల్ హీరో ..మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత హిట్లు ఫ్లాప్ లు అని సంబంధం లేకుండా .. వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకున్న ప్రభాస్ .. బాహుబలి సినిమా తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు .

ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కాబోతున్నాయి . ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ , నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్టుకె సినిమాలలో బిజీగా ఉన్నాడు ప్రభాస్ . ఈ ఏడాది చివరిలో స్పిరిట్ అనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు . మనకు తెలిసిందే అర్జున్ రెడ్డి లాంటి యాటిట్యూడ్ సినిమాను తీసి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సందీప్ వంగా.. ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాల్లో మరోసారి ప్రభాస్ తన లక్కీ హీరోయిన్ అనుష్కతో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా సెకండ్ హీరోయిన్ గా అనుష్క శెట్టి ఫిక్స్ చేసుకున్నారట డైరెక్టర్ . ప్రభాస్ – సందీప్ రెడ్డి కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని టీ- సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించబోతున్నారు. అయితే, ఇటీవల సినిమాపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంతో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు. సినిమా పోలీస్ డ్రామాగా తెరకెక్కనుందని, ప్రభాస్ ను ఫ్యాన్స్ మునుపెన్నడూ చూడని విధంగా చూస్తారని హామీనిచ్చారు. చిత్రానికి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news