Moviesనందమూరి ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్..పండగా చేసుకోండ్రా అబ్బాయిలు..!!

నందమూరి ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్..పండగా చేసుకోండ్రా అబ్బాయిలు..!!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య రీసెంట్గా హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఫుల్ మాస్ ఫ్యామిలీ సెంటిమెంట్ కధానుసారం తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ , మలయాళ బ్త్య్య్టీ హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు .

బాలయ్య ఓ పాత్రలో వీరసింహారెడ్డి మరో పాత్రలో జయసింహారెడ్డి అంటూ ఇరగదీసాడు . మరీ ముఖ్యంగా వీరసింహారెడ్డి పాత్ర నటించిన బాలయ్యకు హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ దక్కుతున్నాయి. పర్ఫెక్ట్ డైలాగ్స్ తో ఎక్కడ ఏ విధంగా బాడీని మోల్డప్ చేసుకోవాలో అక్కడ అలా మెయింటెన్ చేసి నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమా మొదటి రోజు 54 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ రికార్డు నెలకొల్పింది .

ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది . సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజులకి 104 కోట్లు కలెక్ట్ చేసి నందమూరి హీరోకు మరో మంచి విజయం అందించింది .అంతేకాదు ఈ స్పీడ్ ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో కూడా మంచి కలెక్షన్స్ అందుకునే విధంగా వీరసింహారెడ్డి దూసుకుపోతుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . త్వరలోనే బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమాకి కమిట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news