Moviesచిరంజీవిపై ర‌వితేజ‌కు ప్రేమా లేదు.. దోమా లేదు.. ఆ డ‌బ్బు జేబులో...

చిరంజీవిపై ర‌వితేజ‌కు ప్రేమా లేదు.. దోమా లేదు.. ఆ డ‌బ్బు జేబులో పెట్టాకే ఎస్ అన్నాడా…!

సినిమా ఫంక్షన్లలో ప్రసంగాలు చాలా చిత్రంగా గ‌మ్మ‌త్తుగా అనిపిస్తాయి. ఆ ప్ర‌సంగాల్లో ప్రేమ‌లు, అభిమానాలు ఆకాశాన్ని దాటేస్తాయి. అవ‌ధులు దాటిపోతాయి. అస‌లు నిజంగా అన్న‌ద‌మ్ములు, అక్కాచెళ్లెల్లు కూడా అంత ప్రేమ‌తో ఉండ‌ర‌నేంత గొప్ప‌లు చెప్పుకుంటూ.. ఒక‌రిపై మ‌రొక‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రేమ‌ల గురించి తెర‌వెన‌క వినిపించే సంగ‌తులు మాత్రం వేరుగా ఉంటాయి.

రీసెంట్‌గా జ‌రిగిన వాల్తేర్ వీరయ్య సినిమా ఫంక్షన్ లో ఒక‌రిపై మ‌రొక‌రు ప్రేమలు కుమ్మ‌రించేసుకున్నారు. అన్నయ్య సినిమా అంటే చాలు చేసేస్తా.. మ‌రొక విష‌యం కూడా తాను ఆలోచించ‌నే చింంచ‌ను అన్నారు రవితేజ. అన్న సినిమా కోసం డేట్లు స‌ర్దుబాటు చేసుకుని మ‌రీ న‌టించాన‌ని గొప్ప చెప్పుకున్నారు. అయితే చిరంజీవితో అన్న‌య్య సినిమాలో న‌టించిన ర‌వితేజ వేరు.. ఇప్ప‌టి ర‌వితేజ వేరు అన్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపించే మాట‌.

 

ఇప్ప‌టి ర‌వితేజ‌కు బంధాలు, అనుబంధాలు.. చివ‌ర‌కు క‌థ‌ల క‌న్నా కూడా క్యాష్ ముఖ్య‌మ‌నే అంటారు. ఈ సినిమాలో చేసేందుకు కూడా… అది కూడా 44 నిమిషాలు క‌నిపించేందుకు రు. 17 కోట్లు ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేశాడ‌ని టాక్ ? పైగా నిర్మాత‌లు రు. 12 కోట్లు ఇస్తామంటే కాదూ కూడ‌ద‌ని తాను అడిగిన రు. 17 కోట్లు పుచ్చుకున్నాట్ట‌. మ‌రి ఇక్క‌డ ఇంక ప్రేమా దోమా ఏముంది.

ఇక ఐటెం బాంబ్ ఊర్వ‌శీ రౌతేలా కూడా మెగాస్టార్ సినిమా అన‌గానే తాను ఎగిరి గంతేశాన‌ని.. ఆయ‌న‌తో చేయ‌డం త‌న క‌ల అని చెప్పుకు వ‌చ్చింది. కానీ తెర‌వెన‌క క‌థ వేరే ఉంద‌ట‌. అస‌లు ఈ సాంగ్ చేసేందుకు ఊర్వ‌శి ఒప్పుకోలేద‌ట‌. ఆమెను బ‌తిమిలాడ‌డానికే బాబికి చాలా టైం ప‌ట్టింద‌ట‌. చివ‌ర‌కు మ‌రో ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది ద్వారా ఆమెను ఒప్పించ‌డంతో పాటు భారీగానే ముట్ట చెప్పార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news