Moviesబరితెగించిన నాగార్జున హీరోయిన్.... పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకోవడంతో....!

బరితెగించిన నాగార్జున హీరోయిన్…. పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకోవడంతో….!

సినిమా ఇండ‌స్ట్రీలో ఎఫైర్ లు చాలా కామ‌న్ గా క‌నిపిస్తుంటాయి. అంద‌రూ అలానే ఉంటార‌ని చెప్ప‌లేం కానీ సినిమా వాళ్ల ఎఫైర్ లు మాత్రం బ‌య‌ట‌కు ఎక్కువ ఫోక‌స్ అవుతుంటాయి. అంతే కాకుండా ఎక్కువగా హీరోయిన్ల‌కు ద‌ర్శ‌కులు మ‌రియు హీరోల‌తో ఎఫైర్ ఉందంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. ఇదంటే ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామంటే హాయ్ సినిమాలో ఆర్య‌న్ రాజేష్ కు జోడీగా న‌టించిన హీరోయిన్ నిఖిత విష‌యం లో కూడా అలానే జ‌రిగింది.

హాయ్ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ప‌రిచ‌యమైన నిఖిత తెలుగుతో పాటూ త‌మిళ, మ‌ల‌యాళ చిత్రాల‌లో కూడా న‌టించింది. అంతే కాకుండా స్టార్ హీరో నాగార్జున్ హీరోగా న‌టించిన డాన్ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. చాలా సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ నిఖిత‌కు స్టార్ హీరోయిన్ స్టేట‌స్ మాత్రం అందుకోలేక‌పోయింది. అంతే కాకుండా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో నిఖిత సినిమాల నుంచి కూడా పూర్తిగా త‌ప్పుకుంది.

అంతే కాకుండా నిఖిత ప‌ర్స‌న‌ల్ లైఫ్ కూడా వివాదాల్లో చిక్కుకుంది. నిఖిత క‌న్న‌డ స్టార్ ద‌ర్శ‌న్ తో ఓ సినిమాలో న‌టిస్తున్న స‌మ‌యంలో ద‌ర్శ‌న్ తో ల‌వ్ లో ఉందంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అంతే కాకుండా ఆ త‌ర‌వాత ఆ వార్త‌లు కూడా నిజం అయ్యాయి. అయితే ద‌ర్శ‌న్ కు అప్ప‌టికే పెళ్లై పిల్ల‌లు కూడా ఉన్నారు. దాంతో ద‌ర్శ‌న్ భార్య రాజ‌ల‌క్ష్మి హీరోయిన్ నిఖిత – ద‌ర్శ‌న్ ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుని గొడ‌వ‌కు దిగింది. మీడియా ముఖంగా ఇద్ద‌రినీ చివాట్లు పెట్టింది.

దాంతో హీరో ద‌ర్శ‌న్ త‌న భార్య పై గ‌న్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ద‌ర్శ‌న్ తో పాటూ నిఖిత కూడా పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది. ఆ త‌ర‌వాత నిఖిత పై ఇండ‌స్ట్రీ బ్యాన్ విధించి ఆ త‌ర‌వాత బ్యాన్ ఎత్తివేసింది. అప్ప‌ట్లో ఈ వార్త సంచ‌ల‌నం గా మారింది. దాంతో ద‌ర్శ‌న్ పై ప్రేక్ష‌కులు ఫైర్ అయ్యారు. అంతే కాకుండా పెళ్లైన హీరోతో ప్రేమ‌య‌ణ‌మా నీకిదేం మాయ రోగం అంటూ చివాట్లు పెట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news