Moviesడైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కూతురుకు పెళ్లైపోయింది... అల్లుడుకు ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందా...!

డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కూతురుకు పెళ్లైపోయింది… అల్లుడుకు ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందా…!

టాలీవుడ్ టాలెంటడ్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒక‌రు. జూనియ‌ర్ ఎన్టీఆర్ బాల‌న‌టుడిగా ఉన్న‌ప్పుడే ఆయ‌న‌తో బాల రామాయ‌ణం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ తీసి పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేశాడు. అంతా చిన్న‌పిల్ల‌ల‌తో తెర‌కెక్కించిన ఈ సినిమాను తెర‌కెక్కించిన తీర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయిపోయారు. ఆ త‌ర్వాత మ‌నోహ‌రం, చూడాల‌ని ఉంది, ఒక్క‌డు లాంటి సినిమాలు గుణ‌శేఖ‌ర్‌ను ఒక్క‌సారిగా స్టార్ డైరెక్ట‌ర్‌ను చేశాయి. త‌ర్వాత మ‌హేష్‌బాబుతోనే అర్జున్‌, సైనికుడు లాంటి సినిమాలు తీశాక‌.. చాలా లాంగ్ గ్యాప్‌తో రుద్ర‌మ‌దేవి సినిమాతో కం బ్యాక్ అయ్యాడు.

ప్ర‌స్తుతం స‌మంత‌తో శాకుంత‌లం సినిమా తెర‌కెక్కించారు. ఇక గుణ‌శేఖ‌ర్ భార్య నీలిమ‌గుణ కూడా భ‌ర్త సినిమాలు అన్నింటికి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తూ ఉంటారు. ఇక శాకుంత‌లం సినిమాకు నిర్మాత‌గా ఉన్న గుణ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె నీలిమ గుణ పెళ్లి అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఈ వివాహానికి హాజ‌ర‌య్యారు.

గ‌త శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని ప‌ల‌క్‌నామా ఫ్యాలెస్‌లో జ‌రిగిన ఈ వివాహాంలో ప‌లువ‌రు సెల‌బ్రిటీలు హైలెట్‌గా నిలిచారు. ఇక గుణ‌శేఖ‌ర్ అల్లుడు హైద‌రాబాద్‌కే చెందిన వ్య‌క్తి. గుణ అల్లుడు పేరు ర‌వి ప్ర‌ఖ్యా. వీళ్ల‌కు హైద‌రాబాద్‌లో ప‌లు వ్యాపారాల‌తో పాటు కోట్లాది రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయి. ర‌వి ప్ర‌ఖ్యా తండ్రి ప్ర‌ముఖ విద్యావేత్త‌, వ్యాపారవేత్త‌. అలాగే ఎంట‌ర్ ప్రెన్యూర‌ర్ కూడా…!

శ్రీ శ‌క్తి గ్రూప్ సంస్థ‌లు ర‌వి కుటుంబానికి చెందిన‌వే. ర‌వి తండ్రి పేరు డాక్ట‌ర్ రామ‌కృష్ణ‌. త‌ల్లి స‌త్య పింజ‌ల‌. ఇక నీలిమ గుణ కూడా భ‌విష్య‌త్తులో తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే సినిమాల‌కు నిర్మాత‌గా ఉంటూ ప‌లు సినిమాలు తీయాల‌న్న ఆలోచ‌న‌తో ఉంది. మ‌రి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఈ మ‌హిళా నిర్మాత‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news